సంక్షేమ పథకాల్లో దేశానికే రాష్ట్రం ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-16T03:47:26+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని, జిల్లా సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ భారతి హోళికేరి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డీసీపీ అఖిల్‌ మహజన్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.

సంక్షేమ పథకాల్లో దేశానికే రాష్ట్రం ఆదర్శం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జిల్లా సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం 

ఎమ్మెల్సీ, రైతుబంధు చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి  

ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు

మంచిర్యాల కలెక్టరేట్‌/ఏసీసీ ఆగస్టు 15: సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని, జిల్లా సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ భారతి హోళికేరి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డీసీపీ అఖిల్‌ మహజన్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఉదయం 10.30 గంటలకు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్నామన్నారు. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామన్నారు.  అంబేద్కర్‌ ఆశించిన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతీ భారతీయుడు నడుం బిగించాలన్నారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నార న్నారు. ఎన్నో ఏండ్ల కలగా ఉన్న మంచిర్యాల జిల్లాను సీఎం కేసీఆర్‌ నిజం చేశారన్నారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు తీసుకు వచ్చిందని, అందులో భాగంగానే రైతుబంధు, బీమా, మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి, దళితబంధు, ఆసరా పెన్షన్‌లు, తదితర పథకాలు అందిస్తున్నామన్నారు. 

జిల్లాలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు  చేసి  30,550 మందికి వైద్య సేవలు అందించామన్నారు. సాధారణ ప్రసవా లకు ప్రాధాన్యం ఇస్తూ  10123 కేసీఆర్‌ కిట్‌లు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. హమాలివాడలో బస్తీ దవాఖానా, నస్పూర్‌లో పీహెచ్‌సీ మంజూరు చేశామన్నారు. వ్యవసాయ భూములకు ధరణిలో ఉన్న 33 మ్యాడ్యుల్స్‌ ద్వారా  16701 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. సింగరేణి ప్రాంతంలో నివాసముంటున్న  వారికి జీవో నం.76 ప్రకారం వేలాది మంది కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లాలో మెప్మా, సెర్ప్‌ ద్వారా 8333 స్వయం సహాయక సంఘాలకు రూ.358 కోట్లు కేటాయించా మన్నారు. ఆసరా పెన్షన్‌ ద్వారా 27 వేల 367 మంది వృద్ధులు, 36695 మంది వితంతువులు, 11499 మంది దివ్యాంగులు, 244 మంది చేనేత, తదితరులకు పెన్షన్‌లు ఇచ్చామన్నారు. 

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తోందని, సమీకృత మార్కెట్‌, వైకుంఠధా మాలు, డంపింగ్‌ యార్డులు, ప్లే గ్రౌండ్‌లు మంజూరు చేశామన్నారు. ఉద్యానవన, పశు వైద్య, మత్స్య పథకాల ద్వారా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ఒక్కో నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మన ఊరు-మన బడి ద్వారా  248 పాఠశాలలు ఎంపిక చేసి మౌలిక సదుపాయాల పనులు చేపట్టామన్నారు. గ్రంథాలయాల ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్‌ అందజేశామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు  స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్‌లో నాబార్డు, మిషన్‌ భగీరథ పథకాల ద్వారా వంతెనలు, ప్రతీ ఇంటికి నీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.

 మద్యతరహా, చిన్న నీటి పారుదల ద్వారా వ్యవసాయానికి సాగు నీరు అందిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెన్నూర్‌లో లక్ష ఎకరాలకు రూ.1658 కోట్లతో 10 టీఎంసీల నీరు అందించేందుకు ప్రభుత్వం అనుమ తులు జారీ చేసిందన్నారు. రూ.130 కోట్లతో  2616 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా యువతకు ఉపాది కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ సహకార సంఘాలకు రూ.56 కోట్ల 70 లక్షల రుణాలు ఇచ్చామన్నారు. ఆరోగ్య మంచిర్యాల జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేశామని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. 

రాష్ట్రమంతా నిరంతరాయంగా విద్యుత్‌ అందించేందుకు సింగరేణి సంస్థ  గుండెకాయలా పని చేస్తుందన్నారు. 1200 మెగావాట్ల విధ్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని జైపూర్‌లో  ఏర్పాటు చేసి 800 మెగావాట్ల అదనపు విద్యుత్‌  ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారన్నారు. సింగరేణి కంపెనీలు, రోడ్డు, రైలు, రవాణా వ్యవస్థ, నీటి పారుదల వనరులు, జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమికను పోషిస్తున్నాయన్నారు. అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేసి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాల్లో మంచిర్యాల మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో  జిల్లా అటవీ శాఖ అధికారి శివాణి డోంగ్రే, జిల్లా ప్రధాన జడ్జి సత్తయ్య,  ఏసీపీ తిరుపతిరెడ్డి, మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌లు పెంట రాజయ్య, ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, గ్రంథాలయ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, జిల్లా పరేడ్‌ కమాండెంట్‌ మల్లిఖార్జున్‌, రామకృష్ణ, అం జయ్య, జిల్లా అధికారులు శ్రీకాంత్‌రెడ్డి, నారాయణరావు, డీఈవో వెంకటేశ్వర్లు, శేషాద్రి, దుర్గాప్రసాద్‌, ప్రేంకుమార్‌, సంపత్‌కుమార్‌, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-16T03:47:26+05:30 IST