ఎమ్మెల్యే ఇంటి ముట్టడి అమానుషం

ABN , First Publish Date - 2022-03-05T04:42:35+05:30 IST

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇంటిపై మహిళా కాంగ్రెస్‌ నాయకులు చేసిన ముట్టడి అమానుషమని టీఆర్‌ఎస్‌, టీబీ జీకేఎస్‌ నేతలు ఖండించారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ఎస్సీ, బీసీ సెల్‌ పట్టణ కమిటీల అధ్యక్షులు రామస్వామి, మోతె కనకయ్య, టీబీజీకేఎస్‌ నేతలు సురేం దర్‌ రెడ్డి, డికొండ అన్నయ్యలు మాట్లాడారు. విజిత్‌రావుకు పెరుగుతున్న ప్రజా దరణను ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే ఇంటి ముట్టడి అమానుషం
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు

నస్పూర్‌, మార్చి 4: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇంటిపై మహిళా కాంగ్రెస్‌ నాయకులు చేసిన ముట్టడి అమానుషమని టీఆర్‌ఎస్‌, టీబీ జీకేఎస్‌ నేతలు ఖండించారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ఎస్సీ, బీసీ సెల్‌ పట్టణ కమిటీల అధ్యక్షులు రామస్వామి, మోతె కనకయ్య, టీబీజీకేఎస్‌ నేతలు సురేం దర్‌ రెడ్డి, డికొండ అన్నయ్యలు మాట్లాడారు. విజిత్‌రావుకు పెరుగుతున్న ప్రజా దరణను ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడులకు దిగడం మంచి సంస్కృతి కాదని, అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పూనుకున్నారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు ఏనుగు రవీందర్‌ రెడ్డి, కమాలాకర్‌ రావు, రాజేశం, వంగ తిరుపతి, బొయ మల్లయ్య, అన్నపూర్ణ పాల్గొన్నారు. 

దండేపల్లి: ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముట్ట డించడం హేయమైన చర్య అని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, జిల్లా రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు గురువయ్యలు అన్నారు. శుక్రవారం దండేపల్లిలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  మాటకు మాట సమాధా నం చెప్పాలే తప్ప ఇలా ఇంటిని ముట్టడించడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. టీఆర్‌ ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగన్న,  గాండ్ల నరేష్‌, మల్లేష్‌, రాజేందర్‌, సర్పంచులు, పాల్గొన్నారు.  

లక్షెట్టిపేటరూరల్‌: ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటి ముట్టడి హేయమైన చర్య అని డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంత య్యలు అన్నారు. లక్షెట్టిపేట విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు ఏవో మాట లు అన్నారని ఆరోపిస్తూ ప్రేంసాగర్‌రావు తన గుండాయిజాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్‌, నాయకులు జగన్మోహన్‌రెడ్డి, నడిమెట్ల రాజన్న, కౌన్సిలర్‌ సురేష్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

 

Read more