పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-31T03:43:29+05:30 IST

పల్లె ప్రగతి కార్య క్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలె క్టర్‌ భారతి హోళికేరీ పేర్కొన్నారు. సోమవారం మైనార్టీ ఫంక్షన్‌ హాలులో జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్ర మంపై మండల స్ధాయి అధికారులు, కార్యదర్శుల కు అవగాహన సదస్సు నిర్వహించారు.

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ

-వంద శాతం పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

-జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ 

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 30: పల్లె ప్రగతి కార్య క్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలె క్టర్‌ భారతి హోళికేరీ పేర్కొన్నారు.  సోమవారం  మైనార్టీ ఫంక్షన్‌ హాలులో జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్ర మంపై మండల స్ధాయి అధికారులు,  కార్యదర్శుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వందశాతం ఓడీఎఫ్‌ జిల్లాగా  రాష్ట్రం లోనే జిల్లాను ముందుంచామని, ఐదవ విడతలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతా ల్లో పారిశుధ్యం, పరిశుభ్రతకు పాటుపడాలన్నారు.  3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తామని, మండలాలకు ఇచ్చి న లక్ష్యాలను కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేశా మని, గ్రామ అధ్యక్షుడిగా సర్పంచులు, సభ్యులుగా ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, లైన్‌మెన్‌ ఉంటార న్నారు. మండల స్థాయిలో ప్రత్యేకాధికారి ఉంటా రని, పరిశుభ్రత, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలని, ఏ సమస్యనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రహదారి వెంబడి మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెంచాలన్నారు. స్వచ్ఛభారత్‌లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. వైకుంఠధామాలను వాడుకలోకి తేవాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ నిరంతర ప్రక్రియ అని, సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డు లకు తరలించి తడి పొడి చెత్తను వేరు చేయాలని, సిబ్బంది కొరత ఉంటే నియమించు కోవాలన్నారు.  గ్రామంలో, వైకుంఠధామాల్లో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని, పాఠశాలలు, పీహెచ్‌సీలు, గ్రామపంచాయతీలను పారిశుధ్య కార్మికుల ద్వారా రోజు శుభ్రం చేయించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు గ్రామపంచాయతీల ద్వారా పాఠశాలల్లో విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో నారాయణరావు, జడ్పీ సీఈవో నరేందర్‌,  ఆర్డీవో శ్యామలాదేవి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Read more