మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-20T03:46:03+05:30 IST

మధ్యాహ్న భోజన కార్మికుల పెరిగిన వేతనాల జీవోను విడుదల చేయాలని యూనియన్‌ అధ్యక్షురాలు దాసరి రాజే శ్వరి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌లు అన్నారు. సోమ వారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికులకు 2 వేల గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి నేటి వరకు జీవోను విడుదల చేయలేదన్నారు.

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు  19: మధ్యాహ్న భోజన కార్మికుల పెరిగిన వేతనాల జీవోను విడుదల చేయాలని యూనియన్‌ అధ్యక్షురాలు దాసరి రాజే శ్వరి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌లు అన్నారు. సోమ వారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికులకు  2 వేల గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి నేటి వరకు జీవోను విడుదల చేయలేదన్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన దృష్ట్యా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ నెల 23, 24న చలో హైదరాబాద్‌ చేపడుతామన్నారు. సాంబలక్ష్మి, రబియా, విమల, శకుంతల, నర్సయ్య, పద్మ, అంజలి పాల్గొన్నారు.  

చెన్నూరు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.  ఏఐటీ యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీపీఐ మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్యలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వంట కార్మికులకు రూ.3 వేల వేతనం పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారని, ఇప్పటికీ పెరిగిన వేతనాలు రావడం లేదన్నారు. ప్రతి విద్యార్ధికి మెస్‌చార్జీ రూ. 25 చెల్లించాలని, బిల్లులు, వేతనాలు పెండింగ్‌లో లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, కోడి గుడ్ల ధరను పెంచాలని కోరారు. రమేష్‌, కార్మికులు పాల్గొన్నారు.  

Read more