గ్రామాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-11T04:04:20+05:30 IST

గ్రామాల్లో సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. శనివారం మండలపరిషత్‌ కార్యాల యంలో ఎంపీపీ సులోచన అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.

గ్రామాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

దహెగాం, సెప్టెంబరు 10: గ్రామాల్లో సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. శనివారం మండలపరిషత్‌ కార్యాల యంలో ఎంపీపీ సులోచన అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, విద్యుత్‌ సంమ స్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా మండలంలో 3,4,5తరగతి చదివే విద్యార్థు లకు రాగిజావ, అంబలి, ఉదయం పూట అందించడా నికి గ్రామాల సర్పంచులు ముందుకు రావాలన్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా రాగిజావ పిండి ఉచితంగా అందిస్తామన్నారు. విద్యార్థులకు సేవచేయడం అదృ ష్టంగా భావించాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్క రించాలని ఏఈని ఆదేశించారు. పాఠశాలల్లో విచారణ చేపట్టి గైర్హాజరయ్యే ఉపాధ్యా యులపై చర్యలు తీసుకుం టామని ఎంఈవో సమా ధానమిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ టిశ్రీరామరావు, ఎంపీడీవో రాజేశ్వర్‌గౌడ్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధి కారులు పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ

దహెగాం: మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే కోనప్ప ఆసరా కార్డులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మండలానికి 824కొత్త పింఛన్లు మంజూర య్యాయన్నారు. అనంతరం 39మంది లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, 28మందికి సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ జయలక్ష్మి, జడ్పీటీసీశ్రీరామారావు,సర్పంచ్‌లు కృష్ణమూర్తి, జయేందర్‌ పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం 

కాగజ్‌నగర్‌: అన్నివర్గాల వారిని అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వివిధ పథకాలకు సంబంధించిన చెక్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌, తహసిల్దార్‌ ప్రమోద్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Read more