మేకల దొంగలను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-09-13T06:25:24+05:30 IST

మండలంలోని దర్యాపూర్‌ గ్రామ శివారు లో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మేకల షెడ్డు నుండి 5 మేకలను ఎత్తుకెళ్లారు.

మేకల దొంగలను పట్టుకున్న పోలీసులు

నర్సాపూర్‌(జి), సెప్టెంబరు 12 : మండలంలోని దర్యాపూర్‌ గ్రామ శివారు లో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మేకల షెడ్డు నుండి 5 మేకలను ఎత్తుకెళ్లారు. వెంటనే దర్యాపూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ ఇతేషామోద్దీన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పాకాల గీత రాంపూర్‌లో సీసీ కెమెరాల ఆధారంగా టోల్‌ప్లాజా వద్ద నిర్మల్‌ వైపు వెళ్లిన కార్లను టైం స్టాంపింగ్‌ ఆధారంగా పరిశీలించారు. కారు నిర్మల్‌ వైపు వెళ్లడంతో కానిస్టేబుల్‌ రవీందర్‌రెడ్డి జిల్లాకేంద్రంలో పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడు మేకలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇంకా ఎక్కడైనా దొంగతనం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 

Read more