న్యాయస్థానంలో కేసుల రుజువు శాతాన్ని పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-02-16T05:38:01+05:30 IST

న్యాయస్థానంలో కేసుల రుజువు శాతాన్ని పెంపొందించడానికి పోలీసులు కృషి చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

న్యాయస్థానంలో కేసుల రుజువు శాతాన్ని పెంపొందించాలి


ఆదిలాబాద్‌, ఫిబ్రవరి15 (ఆంధ్రజ్యోతి) : న్యాయస్థానంలో కేసుల రుజువు శాతాన్ని పెంపొందించడానికి పోలీసులు కృషి చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కోర్టు విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 పోలీసు స్టేషన్‌లో పరిధిలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా కోర్టు విధులకు హాజరు కావాలన్నారు. నిందితులపై చార్జీషీటు దాఖలు చేయడం, సాక్షులను ప్రవేశ పెట్టడం, జిల్లా జైలు నుంచి నిందితులను సమయానుసారంగా హాజరు పర్చడం, సామన్లు జారీ చేయడం, కోర్టుకు గైర్హాజరయ్యే వారి పై వారెంట్లను తీసుకోవడం తదితర అంశాలపై రోజు వారి విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా పోలీసులు నమోదు చేసిన కేసులు న్యాయస్థానంలో రుజువు చేయడానికి సరైన సాక్ష్యాధారాలను సేకరించాలన్నారు. డీసీఆర్‌బీలో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ గుణవంత్‌రావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి, ఎస్సై హాకీం, పలువరు కానిస్టేబుళ్లు తదితరులున్నారు.

Read more