ఏడాదిలోగా మెడికల్స్‌ అసోసియేషన్‌ భవనం పూర్తి

ABN , First Publish Date - 2022-06-07T05:40:13+05:30 IST

జిల్లాకేంద్రంలో ఫార్మసీ మెడికల్స్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేస్తామని సంఘ నాయకులు తెలిపారు. సోమవారం పట్టణంలోని విశ్వనాథ్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీలో ఐఎంఏ బిల్డింగ్‌ సమీపంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తమ మెడికల్‌ షాపుల యజమానులకు సౌకర్యంగా ఉండేలా కొత్త భవన నిర్మా ణం చేపడుతున్నామని చెప్పారు. మీటింగ్‌ హాల్‌, రెస్ట్‌ రూమ్‌, కార్యాలయంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం సూట్‌ రూ మ్‌ సౌకర్యాలతో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ఏడాదిలోగా మెడికల్స్‌ అసోసియేషన్‌ భవనం పూర్తి

నిర్మల్‌ అర్బన్‌, జూన్‌ 6: జిల్లాకేంద్రంలో ఫార్మసీ మెడికల్స్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేస్తామని సంఘ నాయకులు తెలిపారు. సోమవారం పట్టణంలోని విశ్వనాథ్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీలో ఐఎంఏ బిల్డింగ్‌ సమీపంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తమ మెడికల్‌ షాపుల యజమానులకు సౌకర్యంగా ఉండేలా కొత్త భవన నిర్మా ణం చేపడుతున్నామని చెప్పారు. మీటింగ్‌ హాల్‌, రెస్ట్‌ రూమ్‌, కార్యాలయంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం సూట్‌ రూ మ్‌ సౌకర్యాలతో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాధం అరవింద్‌, నేరెళ్ల ప్రమోద్‌, కోశాధికారి బద్రీ శ్రీనివాస్‌, జిల్లా ముఖ్య సలహాదారు అప్పాల భోజరాజు, సునీల్‌ కుమా ర్‌, సుధీర్‌ కుమార్‌, రాము, వినేష్‌, శిరీష్‌, చక్రధర్‌, భవన నిర్మాణ కమిటీ చైర్మన్‌ అప్పాల వంశీ, తదితరులు పాల్గొన్నారు. 


Read more