వ్యాపారుల మాయాజాలం

ABN , First Publish Date - 2022-07-18T06:47:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నా.. అన్నదాతలు అప్పులు చేయక తప్పడం లేదు. ఉద్దెరపై ఎరువ లు, విత్తనాలు, ఫెస్టిసైడ్‌ మందులు దొరకడంతో పెట్టుబడి సహాయంతో ఇతర అప్పులు తీర్చుకున్నారు. ఈ యేడు వానాకా లం సీజన్‌లో విత్తనాలు వేసిన రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.

వ్యాపారుల మాయాజాలం
ఎరువుల షాపులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫెస్టిసైడ్‌ మందులు

అధిక ధరలకు ఎరువులు, ఫెస్టిసైడ్‌ మందుల విక్రయాలు

ఉద్దెర పేరుతో రైతన్నను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు

రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న వైనం

అరువుపై అదనంగా 25 శాతం వడ్డీ వసూలు

ఒక్కో ఎరువుల బస్తాపై అదనంగా రూ.30 నుంచి రూ.50 చార్జి

గ్రామాల్లో జోరుగా దళారీ దందా

చోద్యం చూస్తున్న అధికార యంత్రాగం

జిల్లావ్యాప్తంగా మొత్తం 300పైగా  ఎరువుల దుకాణాలు.. అనధికారికంగా మరెన్నో.. 

ఆదిలాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నా.. అన్నదాతలు అప్పులు చేయక తప్పడం లేదు. ఉద్దెరపై ఎరువ లు, విత్తనాలు, ఫెస్టిసైడ్‌ మందులు దొరకడంతో పెట్టుబడి సహాయంతో ఇతర అప్పులు తీర్చుకున్నారు. ఈ యేడు వానాకా లం సీజన్‌లో విత్తనాలు వేసిన రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పంట ల సాగుకు కావాల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్‌ మందులను రైతులకు అరువుపై ఇస్తూ కొందరు వ్యాపారులు మాయ చేస్తున్నారు. ప్రతి యేటా జిల్లాలో జరుగు తున్న దళారీ దందా జగమెరిగిన సత్యమే అయినప్పటికీ.. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వానాకాలం పంటల సీజన్‌లో కొందరు దళారులు కొంత సొమ్మును పెట్టుబడిగా పెడుతూ.. పంట చేతికందే సమయానికి పదింతల ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా మా రుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితులు మరీ అధ్వానంగా కనిపిస్తున్నాయి. అ మాయక గిరిజన రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన కొందరు బఢా వ్యాపారులు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో దళారులను నియ మించుకొని.. వారి ద్వారా రైతులకు ఎరువులు, ఫెస్టిసైడ్‌ మందులను అంటగడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 300పైగా ఎరువుల దుకాణాలు ఉన్నప్పటికీ.. అనాధికారికంగా మరెన్నో కొనసాగుతున్నాయి. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తు న్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అమ్మ కాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల బయోమెట్రిక్‌ విధానం అమ లు కాకపోవడంతో విచ్చలవిడిగా ఎరువుల మందులు బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిపోతున్నాయి. నిబంధనలు పాటించని దు కాణాల నుంచి కొందరు అధికారులకు నెలవారి మామూళ్లు అం దుతున్నట్లు ఆరోపణలు కూడా లేకపోలేదు. 

నిలువు దోపిడీ

రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్దెర పేరుతో ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ నిలు వు దోపిడీ చేస్తున్నారు. నగదుకు ఒక రేటు, ఉద్దెరకు మరో రేటు నిర్ణ యిస్తున్నారు. ఒక్కో ఎరువుల బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పంట చేతికి రాగానే ఉన్న అప్పుపై అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఏదో గత్యంతరం లేక రైతులు అరువుపై ఎరువులు, పురుగు మందులను తీసుకుంటూ వ్యాపారుల దోపిడీపై ప్రశ్నించ లేకపోతున్నారు. అడపాదడప నగదుపై కొనుగోలు చేసిన రైతులు మాత్రం ఇదేమిటని ప్రశ్నిస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తూ తమ వద్ద ఎరు వులు లేవని తిప్పి పంపుతున్నారు. పలుమార్లు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. ఫెస్టిసైడ్‌ మందులపై ముద్రించిన అధిక ధరలను చూపుతూ దండుకుంటున్నారు. పంట చేతికి రాగానే ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. ఏ కారణం చేతైనా సకాలంలో అప్పు చెల్లిం కుంటే తమ ప్రతినిధులతో బెదిరింపులకు దిగుతూ వసూలుకు ఎగబ డుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో పెరిగిపోతున్న ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానుల ఆగడాలకు సంబంధిత శాఖ అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

జోరుగా దళారీ దందా

జిల్లాలోని పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే కమిషన్‌పై కొందరు దళారులు ఎరువుల దందాను చేస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఎరువులు, ఫెస్టిసైడ్‌ మందులను నిల్వ చేసుకుంటూ రైతులకు ఉద్దెరపై అధిక ధరలకు అంటగడుతున్నారు. గ్రామంలో మంచి పలు కుబడితో పాటు కొంత ఆర్థిక స్థోమత ఉన్న వ్యక్తులు ఈ దళా రి దందాకు ఎగబడుతున్నారు. గ్రామం లోని చిన్న, సన్నకారు రైతులకు అరువుపై ఎరువులను సరఫరా చేస్తూ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ప్రతియేటా చేసిన అప్పులను తీర్చితేనే.. కొత్తగా ఉద్దెర పై ఎరువు మందులను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. దళా రుల ఇళ్లలోనే ఎరువులను భారీగా నిల్వలు చేసు కుంటూ జీరో దందా చేస్తున్నారు. ఎలాంటి అమ్మకపు రషీదులు ఇవ్వకుండానే విక్రయాలు జరుపుతున్నా రు. ఏదైనా తేడా వస్తే తమకేమీ తెలియదని చేతు లెత్తేస్తున్నారు. జిల్లాలో సాగుతున్న అక్రమ ఫర్టిలైజ ర్‌ వ్యాపారం మాఫియాను తలపిస్తున్న అధికారుల కు పట్టింపే లేకుండా పోతోంది. దాదాపుగా జిల్లాలోని ప్రతీ గ్రామానికి ఒకరు ఎరువుల దళారీగా పనిచే యడం గమనార్హం. 

అదనంగా 25శాతం వడ్డీ వసూల్‌

ఏడాదంతా అరువుపై ఎరువులు, పురుగు మందులను విక్రయి స్తున్న వ్యాపారులు పంట చేతికి రాగానే రైతుల వెంటపడుతూ అప్పు వసూలు చేస్తున్నారు. పండించిన పంటను కూడా తామే కొనుగోలు చేస్తామని నమ్మబలుకుతూ తూకంలో మోసంతో పాటు అందినకాడికి కమీషన్‌ దండుకుంటు న్నారు. ఉద్దెరపై ఇచ్చిన ఎరువు, పురుగు మందుల అప్పు లపై మరో 25శాతం అదనంగా వడ్డీ వసూలు చేస్తు న్నారు. వీటితో పాటు రైతులు ఇతర పెట్టుబడి ఖర్చుల కోసం చేసే అప్పులపై కూడా వడ్డీని వేస్తున్నారు. అధిక ధరలకు ఎరువు మందులను విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని, నకిలీ విత్తనాలను అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెబుతున్న వ్యవసాయ శాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ త తంగం కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. ఇకనైనా అక్రమంగా నడుపుతున్న ఎరువుల దుకా ణాలపై దాడులు చేసి రైతులను అధిక ధరల దోపిడీనుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.

వడ్డీతో భారీగా నష్టపోతున్నాం

: మెట్టు భూమన్న, రైతు, తలమడుగు మండలం

మా రెక్కల కష్టమంతా అప్పు తీసుకున్న వడ్డీకే సరిపోతోంది. ఆపద సమయంలో అప్పు ఇచ్చినప్పటికీ.. పండించిన పంటను దళారులు అప్పు కింద జమ చేసుకుంటున్నారు. ఎంత ఇస్తున్నారో? ఎంత వడ్డీ పెడుతున్నారో? తెలియడం లేదు. పంట అమ్మిన తర్వాత ఇదిగో నీకు ఇంత అంటారు. ఆ తర్వాత మిగిలింది ఇంతా లేదా, నీవు ఇంత అప్పు ఉన్నావంటూ చెప్తారు. నాకు తెలిసి గత 20ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతోంది. అప్పు తీసుకోక తప్పడం లేదు. అప్పు వల్ల మాకు నష్టం తప్ప, లాభం లేదు. అయినప్పటికీ చేసేదేమీ లేక పోవడంతో తప్పనిసరిగా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. 

Updated Date - 2022-07-18T06:47:58+05:30 IST