ఆదివాసీలకు అండగా లేని ఐటీడీఏను కూల్చాలి

ABN , First Publish Date - 2022-12-10T01:56:00+05:30 IST

ఆదివాసీలకు అండగా లేని ఐటీడీఏను కూల్చాలని, ఏజెన్సీ ప్రాంతంలో గల లంబాడాలను ఎస్టీ జాబితా నుం చి తొలిగించి, జీవో నెం.24 ప్రకారం వారి ఏజెన్సీ సర్టిఫికెట్‌లను రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర అ ధ్యక్షుడు బూర్స పోచయ్య, తుడుందెబ్బ నాయకులు అన్నారు.

ఆదివాసీలకు అండగా లేని ఐటీడీఏను కూల్చాలి
మాట్లాడుతున్న రాష్ట్ర అఽధ్యక్షుడు బూర్స పోచయ్య

జీవో 24 ప్రకారం వారికి ఏజెన్సీ సర్టిఫికెట్‌లను రద్దు చేయాలి

పోడుభూముల సమస్యను పరిష్కరించాలి

సీఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం

ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బూర్స పోచయ్య

పోలీసుల భారీ బందోబస్తు

ఇంద్రవెల్లి, డిసెంబరు 9: ఆదివాసీలకు అండగా లేని ఐటీడీఏను కూల్చాలని, ఏజెన్సీ ప్రాంతంలో గల లంబాడాలను ఎస్టీ జాబితా నుం చి తొలిగించి, జీవో నెం.24 ప్రకారం వారి ఏజెన్సీ సర్టిఫికెట్‌లను రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర అ ధ్యక్షుడు బూర్స పోచయ్య, తుడుందెబ్బ నాయకులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజన అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల అస్థిత్వ పోరు గర్జన బహిరంగ సభను నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసీ రగల్‌జెండాలకు ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీ గిరిజన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆదివాసీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లంబాడాలను 1970వ సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేయకుండా గవర్నర్‌ నివే దిక, ట్రైబల్‌ అడ్వైజర్‌ కమిటీ నివేధిక లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చార ని అని అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలిగించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. పక్క రాష్ట్రాలలో ఓసీ, బీసీ, ఎస్సీలుగా చెలామణి అవుతున్న లంబాడాలు తెలంగాణలో ఎస్టీలుగా ఎలా చెలామణి అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్‌ కమిటీ దేశవ్యాప్తంగా షెడ్యూ ల్‌ తెగలను గుర్తించే పనిలో 18 తెగలను ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 9 తెగలను ఆర్టికల్‌ 342లో చేర్చారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో లంబాడాలు అసలు ఎస్టీలు కాదని, ఓటు బ్యాంకు రాజకీయం కోసం డీనోటిఫైడ్‌ ట్రైబల్‌గా మైదాన ప్రాంతంలో విద్యారంగంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో కలిపారని దుయ్యబట్టారు. లంబాడాలు విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా నూటికి తొంబై ఐదు శాతం ఎస్టీ రిజర్వేషన్‌ను అను భవిస్తున్నారని, దీంతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో 1/70, పీసా చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతం లోని గ్రామాల్లో ఏజెన్సీ చట్టాలు అమలు కాకపోవడం వల్ల ఆదివాసీల కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. జీవో నెం.3 యథావిధిగా అమలుచేసి ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రభుత్వం 24 శాఖల్లో ఉన్న ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు. గిరిజన జిల్లాగా పేరు పొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే ఆదివాసీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయ ని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే ఆదివాసీల బతుకులు మారుతా యని అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణలో ఆదివాసీల బతుకులు మారాలంటే మరో పోరాటానికి ఆదివాసీ సమాజం సిద్ధం కావాలని పి లుపునిచ్చారు. ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరించి హక్కు పత్రాలిస్తానని చెప్పిన కేసీఆర్‌, ఇప్పుడు మాట మార్చి ఆదివా సీలను అడవి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు. పోడు భూ ముల సమస్యలు పట్టించుకోకుండా ఆదివాసీలపై అటవీశాఖాధికారుల ను ఉసిగొల్పి ప్రత్యేక దాడులకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గెడం గణేష్‌ అన్నారు. ఆదివా సీలకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించడంలో ఐటీడీఏ విఫల మైందని ఆదివాసీ, గిరిజన నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతకుముందు గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా, ఉట్నూర్‌ సీఐ సైదయ్య, నార్నూర్‌ సీఐల ఆధ్వర్యంలో పోలీసు లు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకాగారి భూమయ్య, మంచిర్యాల జిల్లా అధ్య క్షుడు మడావి వెంకటేష్‌, ఆదివాసీ హక్కుల సమితి మహిళా జిల్లా అధ్యక్షురాలు పెందూర్‌ పుష్పారాణి, కొమురం భీం జిల్లా అఽధ్యక్షుడు కోట్నక్‌ విజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు, తుడుందెబ్బ రాష్ట్ర కార్య దర్శి కొడప నగేష్‌, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గెడం గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, జిల్లా నాయకులు అర్క కమ్ము, ఉట్నూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు కోట్నక్‌ బారిక్‌రావు, మండల అధ్యక్షుడు జుగ్నక్‌ భరత్‌, ఉపాధ్యక్షుడు గెడం భరత్‌, విద్యార్థి సంఘం మండలాఽ ధ్యక్షుడు పుర్క చిత్రు, నాగోరావ్‌, మేస్రం నాగ్‌నాథ్‌, చాకటి మానిక్‌ రావు, పెద్దసంఖ్యలో ఆదివాసీ, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:56:04+05:30 IST