గ్రూపు-1పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-10-13T03:37:11+05:30 IST

రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న టీఎస్‌పీఎస్సీ గ్రూపు-1పరీక్షను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ స్టేట్‌పబ్లిక్‌సెర్వీస్‌ కమిషన్‌చైర్మన్‌ బి జనార్దన్‌రెడ్డి అన్నారు.

గ్రూపు-1పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, జిల్లా అధికారులు

- తెలంగాణ పబ్లిక్‌కమిషన్‌ చైర్మన్‌ బి జనార్దన్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 12: రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న టీఎస్‌పీఎస్సీ గ్రూపు-1పరీక్షను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ స్టేట్‌పబ్లిక్‌సెర్వీస్‌ కమిషన్‌చైర్మన్‌ బి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌తో కలిసి అన్నిజిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, అదనపు కలెక్టర్‌లు, పరీక్షకేంద్రాల ముఖ్యపర్యవేక్షకులు, ఆర్డీవోలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. ఈసందర్భంగా కమిషన్‌చైర్మన్‌ మాట్లా డుతూ ఇప్పటివరకు 2.60లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అన్నారు. అభ్య ర్థులు తమ హాల్‌ టికెట్‌తోపాటు మూడు పాసుపోర్టు సైజ్‌ ఫొటోలు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు తమ వెంట తీసుకురావాలనిఅన్నారు. ఎలాంటిఎలకా్ట్రనిక్‌ వస్తు వులు, మొబైల్‌ ఫోన్‌, కాలిక్యూలేటర్లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష నిర్వహణకు పది కేంద్రాలను ఏర్పాటుచేశామని అన్నారు. పరీక్ష నిర్వహణకు ముఖ్య పర్యవేక్షకులు, లైజనింగ్‌, సహాయ లైజనింగ్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించామని తెలిపారు. అభ్యర్థులకు అన్ని సౌకార్యలు ఏర్పాటు చేశామని తెలిపారు.

- ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు

- జిల్లా అధికారులతో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఈనెల 16న జిల్లాలో జరుగనున్న టీఎస్‌పీఎస్‌సీ గ్రూపు-1 పరీక్షను ఎలాంటిపొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కలెక్ట రేట్‌లో అధికారులతో పరీక్షనిర్వహణపై సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌లో 5, కాగజ్‌నగర్‌లో 5 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షసమయంలో కేంద్రాలవద్ద పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. బయోమెట్రిక్‌ ప్రక్రియ ఉదయం 8.30గంటలలోపు పూర్తి చేయాలన్నారు. ఉదయం10.15లోగా పరీక్ష రాసే అభ్యర్థులు వారికికేటాయించిన గదుల్లో ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ఈనెల 13న జిల్లాకు రానున్నారని వారి సూచనలను పాటించాలని అధికారులకు తెలిపారు.

Read more