పదిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-19T05:07:17+05:30 IST

పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసా రించారు. 2019-20, 2020-21 విద్యాసంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యా సంస్థల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిం చారు.

పదిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
సిర్పూర్‌(టి)లో స్టడీ అవర్స్‌లో చదువుకుంటున్న విద్యార్థులు

- పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

- వంద శాతం ఫలితాలపై ఉన్నతాధికారుల దృష్టి

- జిల్లాలో 165 పాఠశాలల్లో 7,382మంది విద్యార్థులు

- మే 11నుంచి పది పరీక్షలు 

చింతలమానేపల్లి/సిర్పూర్‌(టి), మార్చి 18: పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసా రించారు. 2019-20, 2020-21 విద్యాసంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యా సంస్థల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిం చారు. ఈ విధానంతో చాలామంది విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేకపోయారు. దీంతో ఈ రెండు విద్యాసంవ త్సరాల్లోనూ విద్యార్థులందర్నీ ప్రభుత్వంపాస్‌ చేసింది. అయితే 2021-22 విద్యాసం వత్సరంలో థర్డ్‌వేవ్‌ ప్రభావంతో కొన్ని నెలలపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించింది. వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్ట డంతో సెప్టెంబరు నుంచి పాఠశాలలు పునఃప్రారంభ మయ్యాయి. ఈసారి జరిగే వార్షికపరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయా లని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈఏడాది జరిగే పరీక్షల్లో ఉత్తమఫలితాలు సాధించేందుకు విద్యా శాఖ ఉన్నతాధి కారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రధానో పాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు. సబ్జెక్టులను పూర్తిచేసి రివిజన్‌ క్లాస్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతీరోజూ ఆ పాఠ్యాంశాలవారీగా స్లిప్‌టెస్ట్‌లు నిర్వ హిస్తూ విద్యార్థులసామర్థ్యం పెరిగేలా చూస్తున్నారు. 

జిల్లాలో 165 పాఠశాలలు, 7,382 మంది విద్యార్థులు

పదవ తరగతి వార్షిక పరీక్షలు మే 11నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 165 పాఠశాలల్లో 7,382 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతు న్నారు. ఇందులో 4,150 మంది బాలురు, 3,232 మంది బాలికలు ఉన్నారు. ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

ఉత్తమ ఫలితాల కోసం సాధన చేస్తున్నాం

- జె.కార్తీక్‌, 10వ తరగతి, చింతలమానేపల్లి

ఉన్నత ఫలితాల సాధనే ధ్యేయం గా సాధన చేస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగ తులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు స్లిప్‌టెస్టులు పెడుతూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు

- గ్రీష్మ రాణి, 10వ తరగతి, చింతలమానేపల్లి

మంచిమార్కులు వచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక తర గతులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేస్తున్నారు. 

విద్యార్థులను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాం 

- సోమయ్య, ఎంఈవో

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులను అన్ని విధాలుగా పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. మే11 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అన్ని పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. అన్ని పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవే క్షిసు ్తన్నాం. ఈ ఏడాది ఉన్నతఫలితాలు సాధించేందుకు ప్రత్యేకప్రణాళికతో ముందుకు పోతున్నాం.

Read more