కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-01-24T04:00:25+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకవచ్చేలా నాయకులు కృషి చేయా లని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు. మ్యాదరిపేటలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల సంక్షే మానికి అహర్నిశలు కృషి చేసిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి
మాద్యరిపేటలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

దండేపల్లి, జనవరి 23: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకవచ్చేలా నాయకులు కృషి చేయా లని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు. మ్యాదరిపేటలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల సంక్షే మానికి అహర్నిశలు కృషి చేసిందన్నారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ  కార్యకర్తకు అండగా ఉండేందుకు రెండు లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించిందన్నారు.   డిజి టల్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ తీరును పరిశీలించారు. జడ్పీటీసీ సభ్యురాలు  నాగరాణి-త్రిమూర్తి, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్‌,  నవీన్‌, కాంగ్రెస్‌ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షరాలు పెంట రజిత, నాయకులు చిట్ల రమణ, కస్తూరీ నగేష్‌, ప్రశాంత్‌, రమేష్‌, సర్సయ్య, పాల్గొన్నారు.  

Read more