‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి’

ABN , First Publish Date - 2022-09-14T03:39:35+05:30 IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు కోడి రమేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కాంటా చౌరస్తా వద్ద సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రప టానికి పూలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్య దినంగా చేస్తా మని ప్రజలను మభ్య పెడుతుందన్నారు.

‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి’
సర్దాప్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

బెల్లంపల్లి, సెప్టెంబరు 13: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు కోడి రమేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కాంటా చౌరస్తా వద్ద సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రప టానికి పూలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్య దినంగా చేస్తా మని ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. ప్రభుత్వం తెలంగాణ విమోచన దినో త్సవం పేరుతోనే జరపాలని డిమాండ్‌ చేశారు. రాచర్ల సంతోష్‌కుమార్‌, రాజనర్సు, శ్రీనివాస్‌,  రాజలింగు, శ్రీనివాస్‌, కళ్యాణి, స్రవంతి, పాల్గొన్నారు.  

Read more