ఇంటింటికీ నల్లా నీరు అందించాలి

ABN , First Publish Date - 2022-11-15T23:20:56+05:30 IST

భుత్వం ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తు న్న మిషన్‌ భగీరథ కార్య క్రమం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు.

ఇంటింటికీ నల్లా నీరు అందించాలి

ఉట్నూర్‌, నవంబరు 15: ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తు న్న మిషన్‌ భగీరథ కార్య క్రమం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. మంగ ళవారం ఉట్నూర్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పంద్రజైవం త్‌రావు అధ్యక్షతన ప్రారంభం కాగా జడ్పీ చైర్మన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగాపూర్‌ సర్పంచ్‌ సునీల్‌ జాదవ్‌ మాట్లాడుతూ గ్రామాలకు నల్లానీరు అందడం లేదని ఆరోపించారు. దీంతో గ్రామాల న్నింటికీ మిషన్‌ భగీరథ నీరు సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సురేందర్‌ను జడ్పీ చైర్మన్‌ ఆదేశించారు. దంతన్‌పల్లి ప్రధాన రహదారి పక్కన జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నందున మంచిర్యాల, ఉట్నూర్‌ ప్రధాన రహదారిపై దంతన్‌పల్లిలో స్పీడ్‌ బ్రేకర్‌ వేయించి ప్రమాదాలు జరగకుండా చూడాలని సర్పంచ్‌ భూమన్న కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరైన భవనాలు లేనందున భవనలు మంజూరు చేయించాలని నర్సాపూర్‌(బి) సర్పంచ్‌ కళావతి అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ రాథోడ్‌ చారులత, వైస్‌ ఎంపీపీ బాలాజీ, సింగిల్‌ విండో చైర్మన్‌ ఎస్పీ రెడ్డి, ఎంపీడీవో తిరుమల, ఎంపీవో మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:20:56+05:30 IST

Read more