సింగరేణి కార్మికులకు తీపి కబురు

ABN , First Publish Date - 2022-09-29T04:23:50+05:30 IST

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 30 శాతం లాభాల వాటాను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

సింగరేణి కార్మికులకు తీపి కబురు
లోగో

- 30 శాతం లాభాల వాటా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌  

 - గత సంవత్సరంకంటే పెరిగిన వాటా  

 - ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు  

మంచిర్యాల, సెప్టెంబరు  28 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 30 శాతం లాభాల వాటాను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. లాభాల వాటా  చెల్లిం చాలని చాలా కాలంగా కార్మికులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్న  ప్రభుత్వం లాభాల వాటాను ప్రకటిం చడంతో కార్మికులు హర్షం  వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఉన్న  29 శాతం దాటి అదనంగా మరో శాతం కలుపుతూ మొత్తంగా  30 శా తం వాటాను ప్రకటించారు. అయితే 35 శాతం లాభాల వాటా చెల్లిం చాలని డిమాండ్‌ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులకు ప్రభుత్వం నిర్ణయం రుచించడం లేదు. 

రూ. 26 వేల కోట్ల పైచిలుకు టర్నోవర్‌..

సింగరేణి 2021-2022 ఆర్దిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్‌ రూ. 26,607 కోట్లు చేయగా నికర లాభాలను రూ. 12,227 కోట్లుగా సంస్థ చూపించింది. ఇందులోనుంచి 30 శాతం కార్మికుల వాటాగా కేసీఆర్‌ ప్రకటించారు. సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్‌పైన నికర లాభాలు వెల్లడించగా గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు సీఎండీ శ్రీధర్‌ ప్రకటించారు. యేటా దసరా సమయంలో ప్రకటించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అదే సమయంలో ప్రకటించిన సంస్థ అక్టోబరు  1న లాభాల వాటాను కార్మికులకు ఇచ్చేందుకు నిర్ణయించింది. కార్మికులకు చెల్లించే 30 శాతం వాటా కింద రూ. 368 కోట్లను కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కాగా దసరా కానుకగా లాభాల వాటా ప్రకటించడం పట్ల కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా సు మారు  44 వేల మంది ఉద్యోగులకు యాజమాన్యం లాభాల వాటాను చెల్లించనుంది. 

లక్ష్యం మేరకు ఉత్పత్తి..

సింగరేణిలో యేటా ఉత్పత్తి లక్ష్యం మేరకు జరుగుతుండగా అదే స్థాయిలో నికర లాభాలను కూడా సంస్థ ఆర్జిస్తోంది.  2013-14లో రూ. 11928 కోట్లుగా ఉన్న అమ్మకాలు  123 శాతం వృద్దితో గత ఏడాదికి రూ. 26,607 కోట్లకు చేరుకున్నాయి.  లాభాలు కూడా గరిష్ఠంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో రూ.  419 కోట్లు నికర లాభం సాధించగా  20 21-22 నాటికి రూ. 1227 కోట్ల రూపాయలను సంస్థ ఆర్జించింది. గత ఎని మిదేండ్ల కాలంలో ప్రగతి బాటన పయనిస్తున్న కంపెనీ కార్మికుల సంక్షే మంపై కూడా దృష్టి సారించింది. సొంత ఇండ్లు నిర్మించుకున్న కారి ్మకులకు పది లక్షల రుణంపై  వడ్డీ చెల్లింపు, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంటు మొత్తాన్ని పది రెట్లకు పెంచింది. కార్మికులు చెల్లించే కరెంటు చార్జీలు రద్దు చేయడం, ఉన్నత చదువులో ఉన్న కార్మిక పిల్లలకు  సంస్థ నుంచే ఫీజు చెల్లించడం, లాభాల బోనస్‌, పండుగ అడ్వాన్స్‌ పెంపుదల, తదితర చర్యలు చేపడుతూ వస్తోంది. 

కార్మికులను నిరాశ పరిచింది. 

వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి 

కంపెనీ లాభాల్లో  35 శాతం కార్మికుల వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తుండగా 30 శాతంతో సరిపెట్టడం కార్మిక లోకాన్ని నిరాశ పరిచింది. కంపెనీ నిధులను ఇతర మార్గాలకు తరలించడం వల్లనే కార్మిక లాభాల వాటా  శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది. సంస్థకు రావాల్సిన ఏపీ జెన్‌కో బకాయిల నుంచి రూ.  1600 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయడం వల్ల నికర లాభాలపై దాని ప్రభావం తీవ్రంగా పడింది. ఇప్పుడు ప్రకటించిన రూ.  227 కోట్ల లాభాలమీద, యాజమాన్యం  మాఫీ చేసిన రూ.  1600 కోట్లను కలుపుకుంటే మొత్తం  రూ.  2827 కోట్ల రూపాయలమీద గణనీ యంగా లాభాల వాటా పెరిగి ఉండేది. అట్టి మొత్తం మీద  30 శాతం పంచినా ప్రతీ కార్మికుడికి సుమారు   లక్షా  50 వేల రూపాయల పైచి లుకు వాటా వచ్చి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి,  గుర్తింపు  సంఘం చేతగానితనం వల్ల ప్రతీ కార్మికుడు రూ.  40 వేల నుంచి రూ. లక్ష వరకు కోల్పోవాల్సి వచ్చింది. 

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..

- బాల్క సుమన్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే  

సింగరేణి కార్మికులకు దసరా పండుగ లోపు లాభాల  వాటా ప్రకటిం చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.  తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యేటేటా లాభాల  వాటాను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం లాభాల వాటాతో కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించి ప్రైవేటీకరణ పేరుతో గనులను మోదీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తే తెలంగాణ సీఎం కార్మికుల పక్షాన నిలిచి సంస్థను లాభాల బాటలో  నడిపించడం గొప్ప విషయం. 

Read more