విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

ABN , First Publish Date - 2022-07-06T04:18:40+05:30 IST

విద్యార్థుల లక్ష్య సాధనకు క్రమశిక్షణతో చదువావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో 9.5 జీబీ సాధించిన విద్యార్థినులు జనాబాయి, సావిత్ర, స్వర్ణతో పాటు హెచ్‌ఎం పార్వతీబాయి, ఉపాధ్యాయులను జడ్పీ చైర్‌పర్సన్‌ మంగళవారం సన్మానించారు

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి
మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

జైనూరు, జూలై 5: విద్యార్థుల లక్ష్య సాధనకు క్రమశిక్షణతో చదువావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో 9.5 జీబీ సాధించిన విద్యార్థినులు జనాబాయి, సావిత్ర, స్వర్ణతో పాటు హెచ్‌ఎం పార్వతీబాయి, ఉపాధ్యాయులను జడ్పీ చైర్‌పర్సన్‌ మంగళవారం సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంర తిరుమల, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, జైనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగ్వంత్‌రావ్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్‌, ఎంపీటీసీ కుంర భగ్వంత్‌రావ్‌, నేతకాని మహార్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రవిందర్‌, సర్పంచ్‌ ఆత్రం గిరిజబాయి, నాయకులు పూసం మారు, సతీష్‌,  మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ లక్ష్మణ్‌, ఉప సర్పంచ్‌ సమాధాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more