సీసీ కెమెరాల ఏర్పాటుతో పటిష్టమైన నిఘా

ABN , First Publish Date - 2022-10-07T04:57:48+05:30 IST

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పటిష్టమైన నిఘా ఉంటుందని ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధర్మారం క్రాస్‌ రోడ్డు, కవ్వాల చౌరస్తాతోపాటు బస్టాండ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్‌ రూంను ఏసీపీ ప్రారంభించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుతో పటిష్టమైన నిఘా
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఏసీపీ తిరుపతిరెడ్డి

జన్నారం, అక్టోబరు 6 : సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పటిష్టమైన నిఘా ఉంటుందని ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధర్మారం క్రాస్‌ రోడ్డు, కవ్వాల చౌరస్తాతోపాటు బస్టాండ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్‌ రూంను ఏసీపీ ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఏదైనా నేరాలు, దొంగతనాలు, గొడవలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం సలువుగా ఉంటుందన్నారు. అనంతరం నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్షెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్‌, స్ధానిక ఎస్‌ఐ సతీష్‌, సిబ్బంది ఉన్నారు.  

Read more