‘అక్షరజ్యోతి’పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-12-06T22:20:40+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరజ్యోతి కార్యక్రమంలో నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులను హెచ్చరించారు.

‘అక్షరజ్యోతి’పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మధ్యాహ్న బోజనాన్ని పరిశీలిస్తున్న పీవో వరుణ్‌రెడ్డి

బెజ్జూరు, డిసెంబరు 6: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరజ్యోతి కార్యక్రమంలో నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులను హెచ్చరించారు. బెజ్జూరు, సోమిని, సలుగుపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌ రూంలో రికార్డులను పరివీలించి ప్రతి రోజు వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. వంట గదిలో శుభ్రతను, బియ్యం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం వంట పదార్థాలు సరిగ్గా లేక పోవడంతో మండి పడ్డారు. ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే విధులను నుంచి తొలగిస్తామని ఉపాధ్యాయులను, సిబ్బందిని హెచ్చరించారు.

Updated Date - 2022-12-06T22:20:42+05:30 IST