పల్లె ప్రగతిపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-03-18T05:56:48+05:30 IST

పల్లె ప్రగతి విషయంలో నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ హెచ్చరించారు.

పల్లె ప్రగతిపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌


తాంసి, మార్చి 17 : పల్లె ప్రగతి విషయంలో నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ హెచ్చరించారు. మండలంలోని పోన్నారి, వడ్డాది గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ప్రజలకు కల్పిస్తున్న కనీస సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూ లీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ డబ్బుల విషయంలో కూలీలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రతి రెండు వారాలకు ఒక సారి చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని పొన్నారిలో పాఠశాలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతీ వారం ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం రుచి చూశారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ రవీంద్ర రాథోడ్‌, ఎంపీడీవో రవీందర్‌, ఏపీవో విజయలక్ష్మి, సర్పంచ్‌ శ్రీనివాస్‌, సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ రఘు తదితరులు ఉన్నారు.

Read more