రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-06-12T03:54:41+05:30 IST

రాష్ట్రంలో మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేవైఎం నాయకులు

వాంకిడి, జూన్‌ 11: రాష్ట్రంలో మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌ మాట్లా డుతూ ప్రభుత్వ నిరక్ష్యంవల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా యన్నారు. రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయింద న్నారు. ఇటీవల జరిగిన మైనర్‌ బాలిక అత్యాచారానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  బీజేవైఎం మండలాధ్యక్షుడు వికాస్‌,నాయకులు  పాల్గొన్నారు.

Read more