రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-02-24T03:55:39+05:30 IST

నాగర్‌ కర్నూల్‌లో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి అన్నారు.

రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి 

ఏసీసీ, ఫిబ్రవరి  23: నాగర్‌ కర్నూల్‌లో ఈ నెల  27, 28 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని  సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి అన్నారు.  పట్టణంలోని చార్వాక హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర కమిటీ సదస్సులో విద్యారంగం పరిరక్షణ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు ౉చెప్పారు. పీఆర్‌సీ ఏరియర్స్‌ను 18 వాయిదాల పద్ధతిలో ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయడం సరైంది కాదన్నారు.  33 నెలల పీఆర్‌సీ బకాయిలను వదులుకున్నప్పటికీ రెండు నెలల బకాయిలను 18 విడతల్లో చెల్లిస్తా మనడం రాష్ట్రంలో  నెలకొన్న పరిస్థితులను తెలియజేస్తుం దన్నారు. ఆంగ్ల మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించడాన్ని స్వాగతి స్తున్నామన్నారు. అనంతరం టీఎస్‌ యూటీఎఫ్‌ మంచిర్యాల జిల్లా శాఖలో ఏర్పడిన ఖాళీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్య క్షులుగా చక్రపాణి, ఉపేంద్ర, కోశాధికారిగా నర్సయ్య, కార్యదర్శిగా చంద్రమౌళిలను  ఎన్నుకున్నారు.  సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోల్ల రామన్న, గుర్రాల రాజవేణు పాల్గొన్నారు.  


Updated Date - 2022-02-24T03:55:39+05:30 IST