కల్యాణం..కమనీయం..

ABN , First Publish Date - 2022-04-11T04:05:16+05:30 IST

శ్రీసీతారాముల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ నిర్వహకులు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని పండితులు వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. కల్యాణం అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.

కల్యాణం..కమనీయం..
మందమర్రి పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో కల్యాణానికి హాజరైన కలెక్టర్‌

ఏసీసీ, ఏప్రిల్‌ 10: జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకల ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండుగలా జరి పించారు. వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వనాథ స్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్‌ ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ  రెనొవేష న్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, గట్టయ్య, కాడె ఎల్లయ్య, సంధ్యా రాణి, రీనారాణిదాస్‌, అర్చన, భక్తులు పాల్గొన్నారు.  

పాత మంచిర్యాల రామాలయంలో సీతారాముల కల్యాణా నికి కలెక్టర్‌ భారతిహోళికేరి, ఎమ్మెల్యే దివాకర్‌రావు దంపతు లు, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌, జిల్లా అటవీ శాఖ అధికారి శివాణిడోంగ్రే, ఏసీపీ సాధనరష్మీ పెరమాళ్‌, మున్సిపల్‌ కమిష నర్‌ బాలకృష్ణ, విజిత్‌రావు దంపతులు హాజరయ్యారు.  కార్య క్రమంలో కిషన్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

పట్టణంలోని 17వ వార్డు భక్తాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకలలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు హాజరయ్యారు.  కౌన్సిలర్‌ పూదరి సునీత, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.  

శ్రీకోదండరాయాలయం సీతారామ కల్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు. క్లబ్‌ అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి వీరస్వామి, సభ్యులు పాల్గొన్నారు.  

ఫ మందమర్రిటౌన్‌: పట్టణంలోని పలు ఆలయాల్లో ఆది వారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. పండితు లు వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని జరిపించారు.  మూడో జోన్‌లోని సీతారామాలయంలో జిల్లా పరిషత్‌ చైర్‌ప ర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. జీఎం చింతల శ్రీనివాస్‌, కేకే 1 గ్రూపు ఏజెం టు రాంచందర్‌రావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు మేడి పల్లి సంపత్‌, జె. రవీందర్‌, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి  సత్యనారాయణ దంపతులు సీతారాముల తరుపున పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలయం నుంచి సీతారాముల విగ్రహాలను కల్యాణ వేదికపైకి తీసుకొని వచ్చి 10.30 గంటల కు కన్నుల పండగగా కల్యాణం నిర్వహించారు. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కల్యాణానికి కలెక్టర్‌ భారతి హోళికేరి, తహసీల్దార్‌ దంపతులు హాజరయ్యారు. యాపల్‌ ఏరియాలోని రామాలయంలో నిర్వహించిన కల్యాణా నికి ఎస్‌ఐ భూమేష్‌ దంపతులు హాజరయ్యారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా వేడుకలను అంతరంగికం గా నిర్వహించారు. ఈసారి కల్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామన్‌కాలనీ హనుమాన్‌ ఆలయంలో నిర్వ హించిన కల్యాణ మహోత్సవానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి హాజరయ్యారు. అందుగుల శ్రీనివాస్‌, నరేష్‌, పైడిమల్ల నర్సింగ్‌, డీవీ దీక్షిత్‌లు,  దాసరి నిర్మల, పాల్గొన్నారు.  యాపల్‌ రామాలయాన్ని సీఐ ప్రమోద్‌రావు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు. 

 

Updated Date - 2022-04-11T04:05:16+05:30 IST