10న మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-06-08T04:28:01+05:30 IST

మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో జరుగుతుందని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజారాం పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌లతో కలిసి మాట్లాడారు.

10న మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం
సమావేశంలో మాట్లాడుతున్న మున్నూరు కాపు సంఘ నాయకులు

నస్పూర్‌, జూన్‌ 7: మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో జరుగుతుందని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజారాం పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌లతో కలిసి మాట్లాడారు. సమావేశానికి రాజ్యసభ సభ్యుడు మద్దిరాజు రవిచంద్ర, మంత్రి గంగుల కమలాకర్‌, ఆర్‌టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ విఠల్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, చందర్‌, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యలు హాజరు కానున్నారని, వారికి ఆత్మీయ సన్మానం చేస్తామన్నారు. కార్యక్రమానికి మంచిర్యాల, కుమరంభీంఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన కులస్తులు హాజరుకావా లన్నారు.  సంఘం జిల్లా అఽధ్యక్షుడు నల్ల శంకర్‌, కార్యదర్శి గొంగర్ల శంకర్‌, యూత్‌ విభాగం అధ్యక్షుడు సీపతి సురేష్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.  

దండేపల్లి: ఈనెల 10న జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం విజయ వంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్‌ తెలిపారు. దండేపల్లిలో  కాపు సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు.   

Read more