పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2022-09-28T03:50:01+05:30 IST

పిల్లల ఎదు గుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ, డీఎంహెచ్‌వో, వైద్యాధికా రులతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి పోషకాహార పంపిణీ, వైద్య సేవలు అందించాలన్నారు.

పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళ్లికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు  27: పిల్లల ఎదు గుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ, డీఎంహెచ్‌వో, వైద్యాధికా రులతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి పోషకాహార పంపిణీ, వైద్య సేవలు అందించాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం 250  మం ది, తక్కువ ఉన్నవారు 713 మంది పిల్లలు ఉన్నారన్నారు. వారు పోషకాహార లోపాన్ని అధిగమించే విధంగా బాలామృతం అందజేయాలన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే స్థానిక ఆసుపత్రికి తరలించాలన్నారు. ఎక్కువ కేసులు నమో దవుతున్న ప్రాంతాలను గుర్తించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, వెల్ఫేర్‌ అధికారి చిన్నయ్య, వైద్యాధికారులు నీరజ, అనిత, విజయనిర్మల, సూపరింటెండెంట్‌ అరవింద్‌, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.   

Read more