నిబంధనలు పాటించని ఆస్పత్రులపై నజర్‌

ABN , First Publish Date - 2022-09-25T16:42:44+05:30 IST

ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నజర్‌ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆస్పత్రుల్లో తనిఖీలను

నిబంధనలు పాటించని ఆస్పత్రులపై నజర్‌

ప్రత్యేక వైద్య బృందాలతో తనిఖీలు

రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లు సీజ్‌

17 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు, జరిమానా

హైదరాబాద్‌ సిటీ: ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నజర్‌ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆస్పత్రుల్లో తనిఖీలను  ప్రారంభించింది. జిల్లాలోని పదిహేను క్లస్టర్ల పరిధిలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌, నర్సింగ్‌హోంలలో  శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. తొలిరోజు 49 తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు పాటించని 14 ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. మరో మూడు ఆస్పత్రులకు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకుండా, అనుమతి లేని రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లను సీజ్‌ చేశారు.  


 పనితీరును పరిశీలిస్తున్నాం

అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ల పరిధిలో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంల పనితీరులను పరిశీలిస్తున్నాం. అర్హత గల వైద్యులు ఉన్నారా, పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూంలు, మందులు ఉన్నాయా, నర్సింగ్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది అనువజ్ఞులేనా వంటి అంశాలను తనిఖీ చేస్తున్నాం. లోపం ఉన్న వాటిని సీజ్‌ చేస్తున్నాం. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ లేకపోతే వాటి గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. అనుమతులు తీసుకోని, నిబంధనలు పాటించని వా టిపై చర్యలు తీసుకుంటాం. 

- డాక్టర్‌ వెంకటి, డీఎంఅండ్‌హెచ్‌ఓ 

Updated Date - 2022-09-25T16:42:44+05:30 IST