గజ గజ వణుకుతూ..

ABN , First Publish Date - 2022-12-10T01:53:05+05:30 IST

జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత లు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగి పోతోంది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

గజ గజ వణుకుతూ..
గుడిహత్నూర్‌ మండలం సీతాగొందీ సమీపంలో కమ్మేసిన పొగమంచు ఇలా..

రికార్డు స్థాయిలో 7.7 కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు

శీతల గాలుల ప్రభావంతో పెరిగిపోతున్న చలి తీవ్రత

చలి తీవ్రతతో వణికిపోతున్న గిరిజన గ్రామాలు

అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యనిపుణుల హెచ్చరిక

ఆదిలాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత లు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగి పోతోంది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల లో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. కనిష్ఠ ఉష్ణోగ్రతల పతనం వేగంగా పడిపోతోంది. రాత్రిళ్లతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లోనూ చలి మంటలను వేసుకుంటూ ప్రజలు వెచ్చదనం పొందుతున్నారు. వేడినీళ్లతోనే స్నానాలు చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే వసతిగృహాలు, గురుకులాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఉదయం పూట చన్నీళ్ల స్నానాలు చేస్తూ గజగజ వణికి పోతున్నారు. అలాగే మార్నింగ్‌ వాక్‌ చేసేవారంతా సూర్యుడు ఉదయించిన తర్వాతనే ఆలస్యంగా బయటకు వెళ్తున్నారు. గడిచిన రెండు, మూడు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో ఒక్కసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి తీవ్రత పెరిగి పోయింది. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.3 డిగ్రీలు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.7 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ సీజన్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం ఇదే మొ దటిసారి. ప్రతియేటా జిల్లాలో డిసెంబరులోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతా యి. డిసెంబరు 19, 20, 21, 22వ తేదీలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే అధిక వర్షపాతం, మండిపోయే ఎండలు, వణుకు పుట్టించే చలి గాలుల తీవ్రత జిల్లాలోనే ఎక్కువగా నమోదవుతాయి. మూడు కాలాలు అధిక ప్రభావాన్నే చూపుతాయి. దీంతో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూలీలు, పారిశుధ్య కార్మికులు, రైతులు చలి తీవ్రతకు వణికి పోతున్నారు. కొందరు దాతలు ముందుకు వచ్చి వెచ్చని దుస్తులను అందజేస్తున్నారు. ప్రజలు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.

రాత్రీ, పగలూ చలే..

జిల్లాలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా చలితో గజగజ వణికి పోతున్నా రు. యేటా డిసెంబరులోనే చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు చివరి మాసంలో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవ డం కనిపిస్తోంది. గతేడు మూడు డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రికార్డు నమోదైంది. బోథ్‌ మండలం పొచ్చెర, సోనాల గ్రామాలలో ఏడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, బజార్‌హత్నూర్‌ మండల కేంద్రలో 7.4, మావల మండలం రాంనగర్‌ 8.0, తలమడుగు మండలం బరంపూర్‌ 8.2, జైనథ్‌ మండలం బోరజ్‌ 8.3, ఆదిలాబాద్‌ అర్బన్‌ 8.7, బేల చప్రాల 9.0, ఇచ్చోడలో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర భారతదేశం నుంచి వీచే శీతల గాలుల ప్రభావం జిల్లాపై మరికొన్నాళ్లు ఉంటుంద ని వాతావర ణ శాఖ అధి కారులు చెబు తున్నా రు. ప్రతి యేటా జిల్లాలో డిసెంబరు, జనవరి మాసాలను అతిశీతల మాసాలుగా పరిగణిస్తారు. అయితే గతంలో ఫిబ్రవరి మాసంలోనూ 6.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన దాఖలాలు ఉన్నాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడం కూడా చలి తీవ్రతకు ప్రధానకారణమంటున్నారు.

కమ్మేస్తున్న పొగమంచు

మారుమూల గిరిజన గూడాలను పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగి పోయిందంటూ మారుమూల ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. వెచ్చని దుస్తులను ధరించి చలినుంచి కాపాడుకుంటున్నా రు. అలాగే పశువులు కూడా చలికి అనారోగ్య బారీన పడే అవకాశం ఉండడంతో రాత్రివేళల్లో పశువుల పాకలు, ఇళ్లలోనే పశువులను ఉంచుతున్నారు. కొందరైతే పశువులకు గోనెసంచులు కప్పి వెచ్చదనాన్ని కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రం తో పాటు బోథ్‌ మండలం గుర్రాల తండా, తలమడుగు మండలం కోసాయి, ఉమ్రి, భీంపూర్‌ మండలం అర్లి(టి) గిరిజన గ్రామాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు న మోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రతతో గిరిజన గ్రా మాలు గజగజ వణికి పోతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే జనవరిలో చలి తీవ్రత ఎలా ఉంటుందోనని గిరిజనం బెంబెలెత్తి పోతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లని ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి యటకు వచ్చేందుకు జంకుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు గిరిజన గూడాల్లో ఇంటింటికీ చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రిళ్లు భోజ నం కూడా చలి మంటల వద్దనే కానిస్తున్నారు. ప్రధానంగా భీంపూర్‌, ఇంద్ర వెల్లి, నార్నూర్‌, గాదిగూడ, బజార్‌హత్నూర్‌, సిరికొండ, తలమడుగు మండలా ల్లోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండడంతో చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు గిరిజన గ్రామాల పరిసర ప్రాంతాలు దట్టమైన పొగమంచుతోనే కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూస్తే మరో కశ్మీర్‌లా కనిపిస్తోంది.

డిసెంబరు 1 నుంచి జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

తేదీ గరిష్ఠం కనిష్ఠం

డిసెంబరు 1 29.3 డిగ్రీలు 10.4డిగ్రీలు

డిసెంబరు 2 30.3 13.7

డిసెంబరు 3 30.8 16.2

డిసెంబరు 4 31.8 16.7

డిసెంబరు 5 30.5 13.2

డిసెంబరు 6 30.3 13.7

డిసెంబరు7 30.3 13.5

డిసెంబరు 8 27.8 11.2

డిసెంబరు 9 27.3 7.7

జిల్లాపై శీతలగాలుల ప్రభావం

: శ్రీధర్‌చౌహాన్‌, వాతావరణ శాఖ సీనియర్‌ శాస్త్రవేత్త

గత రెండు, మూడు రోజులుగా జిల్లాపై శీతల గాలుల ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో సాగు చేస్తున్న పత్తి పంటకు చలిగాలులు అంతాగా అనుకూలం కాకపోయినా.. శనగ పంటకు మేలు జరుగుతుంది. కురుస్తున్న పొగమంచుతో పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయితే కొన్ని చీడపీడలు పంట ను ఆశించే అవకాశం ఉంది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నెలాఖరు వరకు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. గతంలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డు ఈసారి కూడా నమోదయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2022-12-10T01:53:09+05:30 IST