శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-10-04T05:07:23+05:30 IST

శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి ఆరె సంక్షేమసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, దాదారాం, వాను, బిక్కాజీ, శ్రీనివాస్‌, తిరుపతి, సత్యనారా యణ, మారుతి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
జడ్పీ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆరె సంఘం నాయకులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 3: శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి ఆరె సంక్షేమసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, దాదారాం, వాను, బిక్కాజీ, శ్రీనివాస్‌, తిరుపతి, సత్యనారా యణ, మారుతి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు: ఛత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని సోమవారం ఆరె కులసంక్షేమ సంఘం నాయకులు తహసీల్దార్‌ జమీర్‌కు వినతిపత్రం అందజేశారు. వచ్చేనెల 15నశివాజీ జయంతి ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు సత్తయ్య, విలాస్‌, తిరుపతి, సంతోష్‌, గణపతి, ఇస్తారి, విలాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more