మహిళలు, బాలికల రక్షణ కోసమే షీటీంలు

ABN , First Publish Date - 2022-03-17T04:40:01+05:30 IST

మహిళలు, బాలికల రక్షణ కోసమే షీ టీంలు ఉన్నాయని షీటీం జిల్లా ఇన్‌చార్జి ఎండీ సిరాజ్‌ఖాన్‌ అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు బుధవారం విద్యార్థినులకు మహిళల భద్రత, రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

మహిళలు, బాలికల రక్షణ కోసమే షీటీంలు
మాట్లాడుతున్న కుమరంభీం జిల్లా షీ టీం ఇంచార్జి ఎండి సిరాజ్‌ఖాన్‌

జైనూరు, మార్చి16: మహిళలు, బాలికల రక్షణ కోసమే షీ టీంలు ఉన్నాయని షీటీం జిల్లా ఇన్‌చార్జి ఎండీ సిరాజ్‌ఖాన్‌ అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు బుధవారం విద్యార్థినులకు మహిళల భద్రత, రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా షీటీం ఇన్‌చార్జి ఎండీ సిరాజ్‌ఖాన్‌ మాట్లాడుతూ ముఖ్యంగా మహిళల భద్రతే లక్ష్యంగా షీటీం పని చేస్తుందని అన్నారు.  అత్యవసర సమయంలో 7901674834, 9346987214 లకు వాట్సాప్‌ చేయాలని పేర్కొన్నారు. జైనూరు ఎస్సై మధుకర్‌, షీ టీం సభ్యులు సునిత, శ్రీలత, కళాశాల ప్రిన్సిపాల్‌ భిక్ష్మయ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:40:01+05:30 IST