విద్యార్థులకు ఎండ తగలకుండా పాఠశాలలో షెడ్లు వేయించాలి

ABN , First Publish Date - 2022-03-16T07:22:52+05:30 IST

వేసవికాలం ప్రారంభమైందని, విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఎండ తగలకుండా ప్రతి పాఠశాలలో షెడ్లు వేయించాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు.

విద్యార్థులకు ఎండ తగలకుండా పాఠశాలలో షెడ్లు వేయించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

నిర్మల్‌ టౌన్‌, మార్చి 15 : వేసవికాలం ప్రారంభమైందని, విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఎండ తగలకుండా ప్రతి పాఠశాలలో షెడ్లు వేయించాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. గ్రామీణాభివృద్ధి పనులపై మంగళవారం  కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ తరగతి గదులలో ఫ్యాన్‌లు, విద్యుత్‌సౌకర్యం కల్పించాలని, గ్రామపంచాయతీ పరిధిలో అంగన్‌వాడి, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల యొక్క శానిటేషన్‌ రిజిస్టర్‌లు ఏర్పాటు చేయాలని, దీనికి పంచాయతీ సెక్రటరీ, ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలని అన్నారు. విద్యార్థులతో జీరోఅకౌంట్‌ ఓపెన్‌ చేయించాలని తెలిపారు. మల్టీ పర్పస్‌ వర్కర్లతో సురక్ష బీమా యోజన పథకంపై అవగాహన కల్పించి బీమా చేయించా లని అన్నారు. లేబర్‌ మొబిలైజేషన్‌లో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్నామని తెలిపారు. నర్సరీలలో, బృహత్‌ పలె ్లప్రకృతి వనాలలో పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం నీరు పోయాలని ఆదేశించారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు కొన్నిచోట్ల స్థలసేకరణ జరగలేదని, త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. మురికినీటి కాలువలు శుభ్రం చేయించి 100 శాతం శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, తదితర వాటిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ పీలు, డీఏవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Read more