డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T22:32:05+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, హౌసింగ్‌ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 24: డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, హౌసింగ్‌ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా జనవరి 15, 2023 నాటికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకా రం కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉంటే లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. మిగిలిన అర్హుల వివరాలతో వెయి టింగ్‌ లిస్టు తయారు చేసి అందించాలని తెలి పారు. ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివ రాలు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో 1,044 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, జన వరి 15, 2023 నాటికి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మిగిలిన 758 ఇండ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నందున త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారుల సమన్వ యంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్‌ నాయక్‌, రాహుల్‌, గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జడ్పీ సీఈవో నరేందర్‌, డీపీవో నారాయణరావు, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:32:23+05:30 IST