విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు

ABN , First Publish Date - 2022-08-12T04:18:07+05:30 IST

భారీ వర్షాలతో పల్లెలు, పట్ట ణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకు పోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలైనప్పటికి దోమలను నిర్మూలించే చర్యలు చేపట్టడంలో పాలకవర్గం, అధికారులు విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.

విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు
జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

పడకేసిన పారిశుధ్యం  

మూలన పడ్డ ఫాగింగ్‌ మిషన్‌లు  

శానిటేషన్‌ పనులకు నిధులివ్వని ప్రభుత్వం  

మంచిర్యాల, ఆగస్టు 11 (ఆంద్రజ్యోతి): భారీ వర్షాలతో పల్లెలు, పట్ట ణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకు పోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలైనప్పటికి  దోమలను నిర్మూలించే చర్యలు చేపట్టడంలో పాలకవర్గం, అధికారులు విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫాగింగ్‌ మిషన్‌లు మూలకు పడ్డాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. 

డెంగీ బారిన ప్రజలు 

దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమ కాటు కారణంగా ప్రజలు డెంగీ వ్యాది బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి  17 మంది డెంగీ బారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స ప పొందుతున్నారు. దోమకాటు కారణంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యాలకు గురవుతున్నారు. దోమల నివారణకు పిచికారీ చేయాల్సిన ఫాగింగ్‌ మున్సి పాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు చేపట్టకపోవడం గమ నార్హం. నిధుల లేమి సాకుతో అధికారులు, పాలకవర్గాలు ఫాగింగ్‌ విష యంలో దృష్టి సారించకపోవడం ప్రజలకు శాపంగా మారింది. 

ఆసుపత్రుల్లో రద్దీ

పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా జ్వరాలు సోకుతుండడంతో  బాధి తులు ఆసుపత్రుల్లో క్యూలు కడుతున్నారు. డెంగీతో పాటు  టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. చాలా మంది కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, జలుబు,  దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతు న్నారు. పారిశుధ్యం అధ్వానంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.  డ్రైనేజీలు చెత్తా చెదారంతో నిండిపోయినప్పటికి నెలల తరబడి శుభ్రం చేయడం లేదనే పేర్కొంటున్నారు. మురుగునీరు నిండిపోయి దోమల ఉత్పత్తి అధికమవుతోంది. రాత్రి వేళల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలతో 351 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

నిధుల లేమితోనే 

గతేడాది పారిశుధ్య పనులకు సంబంధించి జిల్లాకు రూ.45 లక్షలా 25 వేల 267 నిధులను ప్రభుత్వం విడుదల చేయగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం రూ.4.5 లక్షలు విడుదల చేసినట్లు పంచాయతీ అధికా రులు చెబుతున్నారు. నిధులు విడుదలైతే ఫాగింగ్‌తో పాటు దోమల మందులు పిచికారి చేసే అవకాశం ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమై  రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవ డంతో పారిశుధ్యం లోపించి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిధులలేమి కారణంగా మంచినీటి బావుల్లో క్లోరినేషన్‌ చేయలేని పరిస్ధితి  నెలకొంది. నీరు నిలువ ఉన్న చోట బ్లీచింగ్‌, నివా రణకు మిథిలాన్‌ ద్రావణం పిచికారి చేయకపోవడంతో అనారోగ్యాలు తలె త్తుతున్నాయి. ఉన్న అరకొర బ్లీచింగ్‌ పౌడర్‌తో మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు.

నిరుపయోగంగా ఫాగింగ్‌ యంత్రాలు 

ఫాగింగ్‌ యంత్రాలు నిరుపయోగంగా మారిపోయాయి. జిల్లాలోని  7 మున్సిపాలిటీలతో పాటు  311 గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్‌  మిషన్‌లు అందుబాటులో ఉన్నప్పటికి అవసరమైన సామగ్రి లేక మూలనపడ్డాయి. ఒక్కో ఫాగింగ్‌ మిషన్‌ విలువ దాదాపు రూ. 50 వేలు ఉండగా ప్రస్తుతం అవేమి పనికి రాని స్ధితిలో ఉన్నాయి. ఇప్పటికైనా పాలక వర్గం, అధికారులు స్పందించి దోమల నివారణ చేపట్టడంతోపాటు పారిశుధ్య పనులను చేయించాలని ప్రజలు కోరుతున్నారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

డా.సుబ్బారాయుడు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి 

జిల్లాలో డెంగీ కేసులు ఉన్నప్పటికి ప్రజల ఆరోగ్య దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డెంగీతో పాటు విష జ్వరాలు అతిసారం, తదితర అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే అన్ని రకాల మందులను జిల్లా ఆసుపత్రితోపాటు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాం. అనారోగ్యాలకు గురైన ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం ద్వారా సరియైున సమయంలో చికిత్స తీసుకోవాలి. 

Read more