విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు

ABN , First Publish Date - 2022-11-25T01:09:39+05:30 IST

విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాం క్షించారు.

విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు
మాట్లాడుతున్న మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, నవంబరు 24 : విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాం క్షించారు. గురువారం జిల్లా ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శనను సెయింట్‌ థామస్‌స్కూల్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మనఊరు - మనబడి కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. జిల్లాలో 230 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యా యన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పెద్దఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం కల్పిస్తుందన్నారు. ఆంగ్లభాషలో విద్య నభ్య సించే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. విద్యార్థుల్లో సృజన్మాతకత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జడ్పీ చైర్మన్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుకరమణ, డీఈవో రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఫార్మేటివ్‌ అస్సెస్మెంట్‌ టూల్స్‌ పుస్తక ఆవిష్కరణ

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఫార్మేటివ్‌ అస్సెస్మెంట్‌ టూల్స్‌ పుస్తకాన్ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి గురు వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ పుస్తకంతో ఇంగ్లీష్‌ భాషలో వ్యాకరణం నేర్చుకోవడం సులభ తరమవు తుందన్నారు. జడ్పీ చైర్మన్‌ విజయలక్ష్మి, డీఈవో రవీందర్‌ రెడ్డి, ఎల్టా అధ్యక్ష, కార్యదర్శులు కడార్ల రవీందర్‌, భూమన్న యాదవ్‌, వేణుగోపాల్‌, రతన్‌, రామ్మోహన్‌, దత్తాద్రి, సంధ్య, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో గురువారం సాయంత్రం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు 120 మందికి పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:09:41+05:30 IST