పాఠశాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-04T04:04:26+05:30 IST

మనఊరు మనబడి పథకం ద్వారా ఎంపికైన మండలంలోని మామిడిపల్లి, దండేపల్లి, మోకాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో చేప ట్టిన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని డీఈవో వెంకటేశ్వర్‌రావు అన్నారు. దండేపల్లి మం డలం మామిడిపల్లి, దోరగారిపెల్లి, మోకాసిగూడ పాఠ శాలలో మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను సోమ వారం ఎంఈవోతో కలిసి పరిశీలించారు.

పాఠశాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
మామిడిపల్లి పాఠశాలలో పనులను పరిశీలిస్తున్న డీఈవో వెంకటేశ్వర్లరావు.

 దండేపల్లి, అక్టోబరు 3: మనఊరు మనబడి పథకం ద్వారా ఎంపికైన మండలంలోని మామిడిపల్లి, దండేపల్లి, మోకాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో చేప ట్టిన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని డీఈవో వెంకటేశ్వర్‌రావు అన్నారు. దండేపల్లి మం డలం మామిడిపల్లి, దోరగారిపెల్లి, మోకాసిగూడ పాఠ శాలలో మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా  పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను సోమ వారం ఎంఈవోతో కలిసి పరిశీలించారు. కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థు లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.  పాఠశాలలో జరిగే నిర్మా ణ పనులపై అసంపూర్తి వ్యక్తం చేశారు. ఎంఈవో కాసుల రవిందర్‌, సర్పంచు అనవేని ప్రేమలతిరుపతి, సీఆర్పీలు నర్సయ్య, రాజ్‌ మహ్మద్‌, రమేష్‌, సురేందర్‌, శ్రావణ్‌, నగేష్‌, మల్లేష్‌ ఉన్నారు.  

జన్నారం: పొనకల్‌, చింతలపల్లి ఎంపీపీఎస్‌ పాఠ శాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో జరు గుతున్న పనులను సోమవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనులను నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంఈవో విజ య్‌కుమార్‌, ఏఈ విష్ణుకుమార్‌, సర్పంచు జక్కు భూ మేష్‌, ప్రధానోపాధ్యాయులు  జాడి మురళి, శ్రీనివాస్‌, రాములు, సీఆర్‌పీలు దయాకర్‌ శేఖర్‌ ఉన్నారు.  

Read more