గద్దెపై కొలువు దీరిన సారలమ్మ

ABN , First Publish Date - 2022-02-17T04:23:40+05:30 IST

జిల్లాలో బుధవారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభ మైంది. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన ఏర్పాటు చేసిన సమ్మక్క-సారలమ్మ గద్దెలవద్ద భక్తులు పూజ లను నిర్వహించారు.

గద్దెపై కొలువు దీరిన సారలమ్మ
రెబ్బెనలో సారలమ్మను తీసుకు వస్తున్న పూజార్లు, భక్తులు

- వైభవంగా సమ్మక్క- సారలమ్మ జాతర

ఆసిఫాబాద్‌/ కాగజ్‌నగర్‌రూరల్‌/ సిర్పూర్‌(టి)/ దహెగాం/ చింతలమానేపల్లి/ పెంచికలపేట/ రెబ్బెన/ బెజ్జూరు/ తిర్యాణి, ఫిబ్రవరి 16: జిల్లాలో బుధవారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభ మైంది. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన ఏర్పాటు చేసిన సమ్మక్క-సారలమ్మ గద్దెలవద్ద భక్తులు పూజ లను నిర్వహించారు.కాగజ్‌నగర్‌ మండలం పెద్దవాగు పంప్‌హౌజ్‌ సమీపంలో బుధవారం అమ్మవారలను భక్తులు ఉదయం నుంచే దర్శనం చేసుకుంటున్నారు. రాత్రికి సారలమ్మ, పగిడిదద్దరాజు, గోవిందరాజును మేళతాళాలతో తీసుకువచ్చారు. సిర్పూర్‌(టి) మండ లంలోని కోనేరుకాలనీ, చింతలమానేపల్లి మండలం లోని కర్జవెల్లి, దహెగాం మండలంకేంద్ర సమీపంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద బుధవారం జాతర ప్రారంభమైంది.ఈసందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించు కున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. నూతనవస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంచికలపేటలో సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద జడ్పీటీసీ సరిత దంపతులు పూజలు నిర్వహించారు. రెబ్బెన మండలం లక్ష్మిపూర్‌ లో, బెజ్జూరు మండలం రేచినిలో, తిర్యాణి మండలం కన్నెపల్లిలో గద్దెలవద్ద బుధవారం సారలమ్మను అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణిని గద్దెపైకి పూజారులు తీసుకువచ్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై కుటుంబసభ్యులతో వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఎదురుకోళ్లతో వనదేవతలకు పూజలు నిర్వ హించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జర గకుండా పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-02-17T04:23:40+05:30 IST