బియ్యంతోనే సరి

ABN , First Publish Date - 2022-11-24T22:18:05+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదా రులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం నిలిచిపోయింది. ప్రస్తుతం కేవలం బియ్యం పంపిణీకే రేషన్‌ దుకాణాలు పరిమితమవ్వడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.

బియ్యంతోనే సరి
రేషన్‌ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు(పైల్‌)

- ఆందోళనలో లబ్ధిదారులు

- కమీషన్‌ తగ్గిపోవడంతో డీలర్ల ఇబ్బందులు

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదా రులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం నిలిచిపోయింది. ప్రస్తుతం కేవలం బియ్యం పంపిణీకే రేషన్‌ దుకాణాలు పరిమితమవ్వడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు మార్కెట్‌లో నూనెలు, పప్పులు, టీపొ డి ఇతర నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో పేదలు కొనుగోలుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో వైపు రేషన్‌ దుకాణాల ద్వారా వచ్చే కమీషన్‌ తగ్గిపోవడంతో డీలర్లు ఆదాయం సరిపోక కుటుం బ పోషణకు ఇక్కట్లు పడుతున్నారు.

చింతలమానేపల్లి, నవంబరు 24: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు అందించాల్సి ఉండ గా కేవలం బియ్యం పంపిణీతోనే సరిపెడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో నూనెలు, పప్పులు, టీపొడి, గొదుమపిండి ధరలు భారీగా పెరిగి పోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పప్పులు, నూనెలు, గోదుమలు, బియ్యం, చక్కెర, నూనె వంటి పలు రకాల 9రకాల వస్తువులు రేషన్‌ షాపుల్లో పంపిణీ చేసేవారు. దీంతో నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉండేది. రేషన్‌ సరుకుల్లో కోట తగ్గిపోవడంతో డీలర్లకు సైతం కమీషన్‌ ద్వారా వచ్చే ఆదాయం సరిపోక కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు.

నిరుపేదలకు భారం..

కరోనా మహమ్మారి తర్వాత పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో నిరుపేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు. పప్పులు, నూనె, చిం తపండు,టీపొడి తదితర వాటి ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటున్నాయి. గతంలో రేషన్‌ షాపుల ద్వారా తక్కువ ధరకు నిత్యావసరాలు వస్తుండడంతో సామాన్యుడికి కొంత ఉపశమనం ఉండేది. ప్రస్తుతం రేషన్‌ షాపులో కేవలం బియ్యం మాత్రమే ఒక్కో వ్యక్తికి 6కిలోలు పంపిణీ చేస్తున్నారు. దీంతో ఇతర నిత్యావసర వస్తువులు ఎంత ధరైనా పెట్టి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో పామాయిల్‌ నూనె ధర లీట ర్‌కు 60 రూపాయలు, పప్పు కిలోకు 55 రూపాయలు ఇతర వస్తువులు కూడా తక్కువ ధరలోనే లభించేవి. ప్రస్తుతం పామాయిల్‌ నూనె లీటర్‌కు 100 రూపాయలు దాటింది. కంది పప్పు ధర కిలోకి 100 నుంచి 120 రూపాయలుగా ఉంది.

జిల్లాలో 278 దుకాణాలు..

జిల్లాలో 15మండలాల పరిధిలో 278 దుకాణాల ద్వారా కేవలం బియ్యం పంపిణీ మాత్రమే కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,40,306 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరికిఈ కార్డుల్లో 1,27,332 ఆహార భద్రత కార్డులు, 13,024 అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్నాయి. 4.64 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం రేషన్‌ షాపుల ద్వారా ఒక్కోక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. ని త్యావసర వస్తువులకు బదులుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని అప్పటి ప్రభుత్వాలు యోచన చేయగా అది కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగానే రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల సరుకులను అందజేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదా రులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-24T22:18:07+05:30 IST