మహిళలకు సఖి కేంద్రం సహకారం

ABN , First Publish Date - 2022-02-20T04:22:52+05:30 IST

ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు సఖి కేంద్రం తగిన సహకారం, తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నారు.

మహిళలకు సఖి కేంద్రం సహకారం
మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి

- రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి
జైనూరు, ఫిబ్రవరి 19: ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు సఖి కేంద్రం తగిన సహకారం, తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో శనివారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు సఖి కేంద్రం అధ్వర్యంలో మహిళలకు ఏర్పాటు చేసిన ఆవగాహన సదస్సులో ఆమె  మాట్లాడారు. మహిళలకు ఎదైనా అన్యాయం, ఆవమానం జరిగినట్లయితే వెంటనె 1098, 100 టోల్‌ ఫ్రీ నంబర్లుకు ఫోన్‌ చేసి  సమాచారం అందించాలని సూచించారు.  కార్యక్రమంలో సఖి కేంద్రం నిర్వాహకులు సౌజన్య, తహసీల్దార్‌ సాయన్న, ఎస్‌ఐ కళ్యాణ్‌, వైద్యాధికారి నాగేంద్ర, ఏపీఎం సుజాత, ఎంపీపీ కుంరతిరుమల, వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ పింటుబాయి, సిబ్బంది సుమలత తదితరులు పాల్గొన్నారు.

Read more