అంగన్‌వాడీలో అధికార పార్టీ లీడర్‌

ABN , First Publish Date - 2022-04-05T06:52:32+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల ఆలనా, పాలన చూసుకోవాల్సిన ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఏకంగా అధికార పార్టీలో చేరి మండలస్థాయి లీడర్‌గా చెలామణి కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బజార్‌హత్నూర్‌ మండలం దేగామ అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న పి. పుష్పాలత

అంగన్‌వాడీలో అధికార పార్టీ లీడర్‌
ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అంగన్‌వాడీ కార్యకర్త పుష్పలత (వృత్తంలో ఉన్న మహిళ)

ఎమ్మెల్యే సాక్షిగా గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్త
ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల ఆలనా, పాలన చూసుకోవాల్సిన ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఏకంగా అధికార పార్టీలో చేరి మండలస్థాయి లీడర్‌గా చెలామణి కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బజార్‌హత్నూర్‌ మండలం దేగామ అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న పి. పుష్పాలత ఇటీవల ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడం అధికార వర్గాల్లో అలజడి రేపుతోంది. ఆమెతో పాటు మరికొంత మంది మహిళలను పార్టీలో చేర్పించడం పై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. బాధ్యతాయుతంగా పని చేయాలని చెప్పాల్సిన ఎమ్మెల్యేనే ప్రభు త్వ ఉద్యోగులను రాజకీయాల్లో చేరే విదంగా ప్రోత్సహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఐసీడీఎస్‌ బోథ్‌ సీడీపీవో సౌందర్యను వివరణ కోరగా పష్పలతలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read more