రిమ్స్‌ పనితీరు.. దయనీయం!

ABN , First Publish Date - 2022-11-28T01:11:51+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సంయుక్త నిధులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా.. జిల్లాకేంద్రానికి తలమానికంగా ఏర్పాటు చేసిన రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనితీరు దయనీ యంగా మారింది.

రిమ్స్‌ పనితీరు.. దయనీయం!
ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

సకాలంలో వైద్యులకు అందని వేతనాలు

వేధిస్తున్న ఆసుపత్రిలో వైద్యుల కొరత

8 విభాగాలకు.. ముగ్గురే వైద్యులు

ఒక్కొక్కరుగా జారుకుంటున్న వైనం

రూ.156 కోట్లతో నిర్మాణం.. అయినా జనాలకందని వైద్యం

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 27: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సంయుక్త నిధులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా.. జిల్లాకేంద్రానికి తలమానికంగా ఏర్పాటు చేసిన రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనితీరు దయనీ యంగా మారింది. దీంతో వైద్యం అనుకున్న స్థాయిలో అటుంచితే.. కనీసం పీ హెచ్‌సీల స్థాయిలో కూడా వైద్య సేవలు అందించడం లేదని అబాసు పాలైంది. అత్యంత కీలకమైన కార్డియాక్‌, గ్యాస్ర్టో, నెఫ్రాలాజి, న్యూరాలజి, తదితర విభాగాలు ఉండాల్సిన ఆసుపత్రిలో సూది, మందు కూడా దొర క్కపోవడం గమనార్హం. గతంలో ఇక్కడ నలుగురైదుగురు వైద్యులతో కాస్త మెరుగైన సేవలే అందినప్పటికీ.. వైద్యులకు వేతనాలు అందకపోవ డంతో ఒక్కొకరుగా జారుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి మొత్తా నికి ముగ్గురు డాక్టర్లే దిక్కయ్యారు. గడిచిన నాలుగు రోజు ల్లోనే వారు విధుల్లో చేరడం గమనార్హం. వారు కూడా సమయానికి వేతనాలు రాక పోవడంతో భవిష్యత్తులో తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

జిల్లా నలుమూలల నుంచి రోగులు

ఆదిలాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌కు అను బంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పడం, చుట్టు పక్కల జిల్లాల వారందరికీ ఆనందం కలిగించింది. ఈ ఆసుపత్రి ప్రారంభమైన కొత్తలో ఎన్నో ఆశలతో జిల్లాకు నలుమూలల నుంచి, అలాగే, పలు జిల్లాల నుంచి రోగులు తరలివచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ లోని నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాలతో పాటు మహారాష్ట్ర, పరిసర ప్రాంతాల్లోని చాలా మంది రోగులు వైద్యం కోసం రిమ్స్‌కు వచ్చారు. కానీ అనుకు న్నంతగా ఇక్కడ సేవలు అందకపోవడంతో అందరు ఇక్కడికి రావడం మానేశారు. ఆదివాసీలు, నిరుపేదలు అధికంగా నివసించే ఈ జిల్లాలో రిమ్స్‌ ఆసుపత్రితో పాటు ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది.

రూ.156 కోట్లతో ప్రారంభం

జిల్లాలోని బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నిర్ణయించాయి. ఇది రూ.156 కోట్ల వ్యయంతో 2014లో నిర్మాణాన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి సుమారు ఏడేళ్ల పాటు నిర్మాణ పను లు సాగాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగడంతో ఆది లోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై విమర్శలు వ్యక్తమయ్యా యి. అనంతరం 2021లో ప్రస్తుత రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆగమేఘాల మీద ప్రారంభించా రు. మొత్తం కీలకమైన ఎనిమిది విభాగాలు కార్డియాలజి, న్యూరాలజి, లెఫ్రాలజి, కార్డియోథెరపిక్‌ సర్జరి, అంకాలజి, ప్లాస్టిక్‌ సర్జరి, యురాలజి, బర్న్స్‌ సర్జరి వంటి సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వైద్యులు వచ్చేందు కు వెనుకడుగు వేయడంతో అధికారులు తొలుత న్యూరాలజి, యురాలజి, పీడియాట్రిక్‌ సర్జరి, కార్డియాలజి వంటి నాలుగు సేవలను ప్రారంభిం చారు. కొన్నినెలల పాటు సాగిన ఈ వైద్య సేవలు.. ఆ తర్వాత సమస్య లు వేధించాయి. ముందుగా కార్డియాలజి వైద్యుడు వెళ్లిపోవడంతో మూడు సేవలు కొనసాగాయి. మళ్లీ న్యూరాలజి వైద్యుడు సైతం రాజీనా మా చేశారు. న్యూరాలజి, పీడియాట్రిక్‌ సర్జరి సేవలు కొనసాగుతున్నా.. ఇందులోని వైద్యులు సైతం విధులు నిర్వర్తించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు మాత్రమే లభిస్తున్నాయి.

వేధిస్తున్న వేతనాల సమస్య

దాదాపు రూ.156 కోట్లతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేసే వారికి సమయానికి వేతనాలు అందకపోవడంతోనే ఆసుపత్రి అబాసుపాలైనట్లు తెలుస్తుంది. ఆసుపత్రుల్లో పనిచేసేందుకు ఇతర ప్రాం తాల నుంచి వైద్యులు వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా అసలే అరకొర వేతనం అందిస్తుండగా.. అది కూడా సక్రమంగా అందక పోవడంతో వైద్యులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇందులో పని చేస్తున్న ఒక్కో వైద్యుడికి నెలకు రూ.1.25 లక్షలు అందజేస్తున్నారు. ఆయా ముఖ్యమైన విభాగంలో నిపుణులు లేక పోవడంతో సంబంధిత వైద్యులకు ఇది తక్కువ వేతనంగానే కనిపిస్తుంది. అదికూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్న ట్లు తెలుస్తుంది. మరోపక్క ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా ఉండక పోవ డం వైద్యుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంల్లో విధుల్లో చేరిన వైద్యులు నెలరోజుల్లోనే విధులు మానేయగా.. మరొకరు రాజీనా మా చేశారు. ఇంకొకరు కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఆసు పత్రి వర్గాలు చెబుతున్నాయి.

అందుబాటులో ముగ్గురు వైద్యులు

ఆదివాసీ జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ముందుగా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు కలుపుకుని మహారాష్ట్రలోని పలు ప్రాంతాల ప్రజలకు సైతం వైద్య సేవలు అందిస్తుందని అందరు భావించారు. ఆసుపత్రి ఎట్టకేలకు ఏడేళ్లకు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభమైనా.. వైద్యుల కొరత మాత్రం తీరడం లేదు. అన్నిహంగులతో నిర్మాణం చేసుకున్న రిమ్స్‌ సూ పర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎనిమిది విభాగాలకు గాను గత యేడాది కాలంగా పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం గమనర్హాం. ప్రస్తుతం గత నాలుగు రోజుల క్రితం ముగ్గురు వైద్యులు విధుల్లో చేరినట్లు రిమ్స్‌ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో వైద్యుల నియా మకం చేపట్టాలంటే ఎన్నేళ్లు ఎదురుచూడాల్సి వస్తుందో నని ప్రజలు చెప్పుకుంటున్నారు. వందల కోట్ల రూపాయలతో ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో నేటికీ వైద్య సేవలు అందకపోవడం శోచనీయం. ముఖ్యంగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో జనాలకు అందకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణం

అన్నివర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేసుకున్న ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి స్థానిక ప్రజాప్రతినిధు ల నిర్లక్ష్యం కారణంగా జనాలకు వైద్య సేవలు అందించడంలో విఫలమైం ది. కేంద్ర ప్రభుత్వం రూ.136కోట్ల వాటా చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.20 కోట్లు చెల్లించాలి. అయితే వాటా చెల్లింపులతో ఏడేళ్లుగా రాజకీయం చేయడమే తప్ప, ప్రజలకు అందించే వైద్య సేవల పై పట్టిం చుకునే నాథుడే లేకపోయాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరు రాజకీయ స్వార్థాలకు పోకుండా ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లి పూర్తిస్థాయిలో రిమ్స్‌లో వైద్యులను నియమించ డంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కానీ ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రే కాకుండా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌లు పట్టీపట్టనట్లు ఉండడం, వారి నిర్లక్ష్యంతో అర కొర వసతులతోనే జనాలకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రిమ్స్‌ ఆసుపత్రికి అత్యవసరంతో వచ్చిన రోగులను స్వయంగా వైద్యులే అందుబాటులో లేకపోవడంతో ఉన్న జూనియర్‌ డాక్టర్లు హైదరాబాద్‌, మహా రాష్ట్రలోని యవత్‌మాల్‌, నాగ్‌పూర్‌లకు రెఫర్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొం ది. ఇప్పటికైనా రిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్యులను నియ మించి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-28T01:11:56+05:30 IST