ఘనంగా ముత్యాల పోచమ్మ ఆలయవార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-02-23T06:05:11+05:30 IST

మండల కేంద్రంలోని శాంతినగర్‌ కాలనీలోని ముత్యాలపోచమ్మ ఆలయవార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఘనంగా ముత్యాల పోచమ్మ ఆలయవార్షికోత్సవం
గోదావరి వద్ద పూజలు, నదీ జలాలతో శోభాయాత్ర

తొలిరోజు అమ్మవారికి వైభవంగా జలాభిషేకం

గోదావరి నుంచి  ఆలయానికి నదీ జలాల ఊరేగింపు

ఖానాపూర్‌, ఫిబ్రవరి 22 : మండల కేంద్రంలోని శాంతినగర్‌ కాలనీలోని ముత్యాలపోచమ్మ ఆలయవార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయం నుంచి శోభాయాత్రగా గోదావరికి తరలివెళ్ళి అక్కడ నదీస్నానాలాచరించి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించేందుకు నదీ జలాలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. అనంతరం అమ్మవారి కి జలాభిషేకం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో అమ్మ వారి ఆభరణాల ఊరేగింపును నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, ఆలయ ధర్మకర్త కల్వకుంట్ల నారాయణతో పాటు పలువరు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ వేడుకలను హైదరాబాద్‌కు చెందిన ఛండీ ఉపాసకులు పాలెం మనోహరశర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో పట్టణ పురవీధులన్నీ మార్మోగాయి. 


Updated Date - 2022-02-23T06:05:11+05:30 IST