ప్రాణహిత పుష్కరాలకు నిధులు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-03-17T04:38:52+05:30 IST

ప్రాణహిత పుష్కరాలకు నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

ప్రాణహిత పుష్కరాలకు నిధులు విడుదల చేయాలి
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌, మార్చి 16: ప్రాణహిత పుష్కరాలకు నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, అదనపుకలెక్టర్‌ రాజేశంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లిశ్రీనివాస్‌ మాట్లాడుతూ పుష్కరగాట్లు, స్నానాల గదులు, తదితర పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు, వెంకటేష్‌, వీరభద్రాచారి, రాకేష్‌, వానుపటేల్‌ పాల్గొన్నారు. 2 కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు 


Read more