సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏల ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-18T04:13:08+05:30 IST

న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిర్పూరు నియోజకవర్గంలోని వివిధ తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వీఆర్‌ ఏలు బుధవారం కాగజ్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.

సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏల ర్యాలీ
ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు

- ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా 

కాగజ్‌నగర్‌, ఆగస్టు 17: న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిర్పూరు నియోజకవర్గంలోని వివిధ తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వీఆర్‌ ఏలు బుధవారం కాగజ్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ విజయ్‌ మాట్లాడుతూ నెలరోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించ లేదన్నారు. తమ న్యాయమై డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేశారు. 

బీజేపీ నాయకుల మద్దతు.. 

బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబు బుధవారం శిబిరాన్ని సందర్శించి మద్దతుపలికారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం హామీ ఇచ్చిన మేరకు వెంటనే అమలు చేయాలని డిమాండు చేశారు. వీఆర్‌ ఏలు ఎలాంటి పోరాటాలు చేసిన పూర్తి మద్దతు పలుకుతామన్నారు.

Read more