వర్షం.. వణుకు

ABN , First Publish Date - 2022-10-08T06:43:17+05:30 IST

కదులుతున్న మేఘాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేజారి పోతున్నాయంటూ ఆవేదనకు గురవుతున్నారు. మును పెన్నడూ లేనివిధంగా ఈ యేడు అధిక వర్షాలు కురవ డంతో పంటలు ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. చేతికి వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షాలు దిగుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

వర్షం.. వణుకు
తాంసి మండలంలో బురద నీటిలోనే సోయా పంటను తరలిస్తున్న రైతులు

జిల్లాలో అన్నదాతలను వెంటాడుతున్న అకాల వర్షాలు

పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు

నాణ్యత, తేమ శాతం పేరిట పంట  కొనుగోలు ధరలో కోతలు

చేతికి వచ్చినా.. చేజారి పోతున్నాయని బాధిత రైతుల ఆందోళన

ఈ యేడు సోయా మద్దతు ధర రూ.4,300 పలుకగా.. పత్తి పంటకు రూ.6,225

అంతటా తిరుగుముఖం పట్టిన నైరుతి రుతుపవనాలు

జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు

ఆదిలాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కదులుతున్న మేఘాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేజారి పోతున్నాయంటూ ఆవేదనకు గురవుతున్నారు. మును పెన్నడూ లేనివిధంగా ఈ యేడు అధిక వర్షాలు కురవ డంతో పంటలు ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. చేతికి వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షాలు దిగుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. గత పక్షం రోజులుగా జిల్లాలో సోయా, పత్తి పంటలు చేతికి వచ్చినా.. ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఆదర బాదరగా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మేసుకుంటు న్నారు. ఈ యేడు సోయా మద్దతు ధర రూ.4300, పత్తి మద్దతు ధర రూ.6225 పలుకుతోంది. దీంతో 6లక్షల క్వింటాళ్ల సోయా, 27లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పంట కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా.. జిల్లా లో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. కురుస్తున్న వర్షాలకు పంటలను అమ్ముకునే పరిస్థి తి లేక రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకుం టున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనా లు తిరుగుముఖం పట్టాయని వాతా వరణ శాఖ నిపుణులు పేర్కొంటు న్నా.. గత రెండురోజులుగా జిల్లా లో కురుస్తున్న వర్షాలతో రైతు లు ఆగమాగ మవుతున్నారు. 

 అమ్ముకోవాలన్న అవస్థలే..

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవాలన్నా.. రైతు లు అవస్థలే పడాల్సి వస్తుంది. పంటను పండించడం ఒకవంతైతే, చేతికి వచ్చిన పంటలను అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలను కాపాడుకునే ప్ర యత్నం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటలను నిల్వ చేసుకునే అవకా శం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, ఖాళీ స్థలాల్లో పంట లను ఆర బెడుతూ.. రాత్రీ, పగలు అనే తేడా లేకుండానే పంట కుప్ప ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సోయా పంట తడవడంతో నాణ్యత దెబ్బతింటోందని అన్నదాతలు వాపోతున్నారు. అంతేకాకుండా.. పగలంతా పంటలను ఆరబెట్టడం, రాత్రి వేళల్లో పాలథిన్‌ కవర్లను కప్పి పంటలను కాపా డుకోవడం రైతులకు ప్రత్యేక పనిగా మారింది. ఇప్పుడిప్పుడే సోయా పంట కోత లు ఊపందుకుంటున్న సమయంలో కురుస్తున్న వర్షానికి పంట కోతలకు ఆటం కంగా మారింది. వెంటాడుతున్న వర్షాలతో పంటల కోత, నూర్పిడి, పత్తి ఏరేందు కు రైతులు పడ రాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి నేలలే కావడంతో వర్షం కురిసిన నాలుగైదు రోజుల వరకు సాగు పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు.

దండుకుంటున్న వ్యాపారులు

తడిసిన పంటను వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాక పోవ డంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ యేడు పత్తి, సోయా పంటలకు మద్దతును మించి ధరలు పలుకడంతో ఇప్పట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. దీంతో రైతులు ఆదరబాదరగా అమ్మే సుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పంట నాణ్యతగా లేదంటూ దళారులు కొర్రీ లు పెడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో సోయా పంటను కొనుగోలు చేస్తున్న దళారులంతా కుమ్మకై ధరను తగ్గిస్తున్నారు. పంట నాణ్యత ను బట్టి రూ.4500 నుంచి రూ.5వేల వరకు ధర పలుకుతున్నా.. నాణ్యతను సాకుగా చూపుతూ.. ధరలో భారీగా కోతలను విధిస్తున్నారు. గత నాలుగైదు రో జుల వరకు రూ.5వేలకు పైగా ధర పలికిన సోయలు.. ప్రస్తుతం రూ.4300 నుంచి రూ.4600 వరకు ధర పలుకుతోంది. మరికొన్ని మారుమూల గిరిజన గ్రా మాల్లో అయితే, దళారులు చిల్లరగా కొనుగోలు చేస్తూ ఎంతో కొంత ముట్ట చెబుతున్నారు. నాణ్యత, తూకంలో కోతలు పెడుతూ.. వ్యాపారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. పంట డబ్బులను నగదుగా చెల్లిస్తా మంటూ ధరలో కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా.. దళారి దందానే కనిపిస్తోం ది. రైతులు అత్యవసరాల పేరిట ఎంతో కొం తకు అముమకుంటూ అవసరా లు తీర్చు కుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇంత జరు గుతున్నా.. జిల్లా అధికారు ల పర్యవేక్షణ మాత్రం కరువ వుతూనే ఉండ డం గమనార్హం.

చేతికి వచ్చిన పంటను ఆదరాబాదరగా అమ్ముకోవద్దు

: శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌

చేతికి వచ్చిన పంటలను రైతులు ఆదరాబాదరగా అమ్ముకుని నష్టపోవద్దు. ఈ యేడు సోయా, పత్తి పంటలకు మద్దతును మించిన ధరలు ఉన్నాయి. మద్దతు ధర కంటే బయట మార్కెట్‌లో తక్కువ ధర పలికితే వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో కురుస్తు న్న అకాల వర్షాలకు పంట దిగుబడులు తడవకుండా జాగ్రత్త పడాలి. నాణ్యమైన పంటలను తీసుకొచ్చి మంచి ధర పొందాలి. చిన్నపాటి మెలకువలను పాటిస్తే ప్రతీ రైతుకు మద్దతు ధరకు మించిన ధరలు వస్తాయి. ఈ యేడు వాతావరణం సహకరించడంతో పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలోనే కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-10-08T06:43:17+05:30 IST