విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , First Publish Date - 2022-09-28T05:48:27+05:30 IST

వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ హాస్టళ్ల నిర్వ హణ చేపట్టాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం బంగారు గూడలోని తెలంగాణ మైనార్టీ సంక్షేమ వసతి గృహంలో జిల్లాలోని

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ 

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 27: వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ హాస్టళ్ల నిర్వ హణ చేపట్టాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం బంగారు గూడలోని తెలంగాణ మైనార్టీ సంక్షేమ వసతి గృహంలో జిల్లాలోని సంక్షేమ శాఖ ల వసతి గృహాలు, కేజీబీవీ విద్యాలయాలు, మహాత్మా జ్యోతి బాపులే తదితర హాస్టళ్ల భోజన తయారీ సిబ్బంది, సంక్షేమ అధికారులకు ఓరియెంటేషన్‌, శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడు తూ విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుచి, రుచి కలిగి ఉండాలని, నాణ్యత  ప్ర మాణాలతో తయారు చేయాలన్నారు. వంటల తయారి చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సరుకులను శుభ్రపరచుకోవాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించడం ద్వారా విద్యార్థుల ఎదుగుదల, చురుకుదనం, మంచి విద్యను అభ్యసిస్తారని అన్నారు. ప్రతీ వసతి గృహంలో మోడల్‌ స్టోర్‌ రూమ్‌ తయారు చేసుకోవాలని సూచించారు. ఈ సెలవుల కాలంలో ఏమైనా మార్పులు ఉన్నట్ల యితే చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది భోజన తయారీదారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలి పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ భోజన తయారు సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పిల్లల ఆరోగ్యం, భోజనంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. టీమ్‌ వర్క్‌తో పని చేసి విద్యార్థులకు మంచి భోజనం అందించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కుక్‌లకు సూచించారు. ఈగలు, దోమలు, ఎలుకలు రాకుండా వంటగదులను, స్టోర్‌ రూమ్‌లను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బియ్యం, కూరగాయలు, సరుకులను సక్రమంగా నీటితో కడిగి వంటకు వినియోగించా లన్నారు. ప్రణాళికలతో వంటలు తయారు చేసి శుభ్రమైన, రుచికరమైన భోజనాలు విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో భోజన విషయాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం వంట గదులను, భోజన తయారిని పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖల అధికారులు కృష్ణవేణి, సునీత కుమారి, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.

Read more