మంత్రి కేటీఆర్‌ హామీల ప్రతిపాదనలు సిద్ధం

ABN , First Publish Date - 2022-09-30T06:09:50+05:30 IST

బాసర ట్రిపుల్‌ఐటీకి ఇటీవలే మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.

మంత్రి కేటీఆర్‌ హామీల ప్రతిపాదనలు సిద్ధం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడుతున్న వీసీ వెంకటరమణ

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమర్పించిన వీసీ వెంకటర మణ 

బాసర, సెప్టెంబరు 29 : బాసర ట్రిపుల్‌ఐటీకి ఇటీవలే మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్‌ గురువారం వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి సమర్పించారు ఆధునిక ల్యాబ్‌ కోసం వెయ్యి లాప్‌టాప్‌లు, ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం మరికొన్ని లాప్‌టాప్‌లు కొనుగోలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇచ్చారు. టీహబ్‌ కోసం అవసరమైన పరికరాలరు, స్థలపరిశీలన , అవసర మైన నిధులు వంటి వివరాలతో నివేదిక ఇచ్చారు. ఆడిటోరియంలో కుర్చీలు, సామాగ్రి ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం విన్నవించారు. యూనివర్సిటీలో చేపడుతున్న మౌలిక వసతులు, వంటశాలల మరమ్మత్తుల పనుల గురించి మంత్రికి వివరించారు. అదేవిధంగా అకాడమిక్‌ పరంగా తీసుకుంటున్న చర్యల గురించి డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ మంత్రి దృష్టికి తెచ్చారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని, అంతేగాకుండా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చినట్లు వీసీ ప్రకటనలో తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో వీసీ, డైరెక్టర్‌తో పాటు అధ్యాపక సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-09-30T06:09:50+05:30 IST