ప్రొఫెసర్‌ జయశంకర్‌ మహోన్నతమైన వ్యక్తి

ABN , First Publish Date - 2022-06-22T06:19:50+05:30 IST

తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలకలాం గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. మంగళవారం జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి

ప్రొఫెసర్‌ జయశంకర్‌ మహోన్నతమైన వ్యక్తి
ఆదిలాబాద్‌లో జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌, నాయకులు

జిల్లా అంతటా సార్‌కు ఘన నివాళి

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 21: తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలకలాం గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. మంగళవారం జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  

ఉట్నూర్‌: ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్య మస్ఫూర్తి ప్రధాత ఆచార్య జయశంకర్‌ వర్దంతి సందర్భంగా  మండలంలోని స్థానిక ఎంపీడీవో, ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిఽధులు జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందు లో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, ఐటీడీఏ చైర్మన్‌ కనక లక్కే రావు, రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీ బాయి, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్‌, ఎంపీపీ పంద్రం జైవంత్‌ రావు, ఎంపీడీవో తిరుమల, తదితరులున్నారు. 

భీంపూర్‌: మండల కేంద్రంలో మంగళవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మేకల నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తలమడుగు: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు ఆదేశానుసారం ఆచార్య ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా మండల టీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు.

Updated Date - 2022-06-22T06:19:50+05:30 IST