ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ABN , First Publish Date - 2022-11-28T22:21:43+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 28: ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తు న్నామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు.

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 28: ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తు న్నామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. జిల్లాలోని కోసిని గ్రామానికి చెందిన వసాకే హన్మంతు తాను మీసేవ కేంద్రం కోసం దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసి అర్హుడిని అయ్యాయని తనకు మీసేవ కేంద్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. పవర్‌గూడకి చెందిన భరతబాయి తాము కొన్నిసంవత్సరాలుగా గ్రామశివారులోని భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని ఇటీవల కొందరు తనభూమిని ఆక్రమించుకొని పత్తిపంట వేశారని అన్నారు. ఆ భూమికి సంబంధించి దస్తావేజులు, పహానీలు ఉన్నాయని వాటిని పరిశీలించి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్‌ మండలం భాగ్య నగర్‌ కాలనీకి చెందిన మోసిన్‌ తన భూమి, ఇల్లు అడగ్రామముంపులో పోగా మాకు ప్లాట్‌ నెం.51 చూపించి ఇల్లు నిర్మించు కోవా లని పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. 12 సంవ త్సరాలుగా ఇక్కడే నివసిస్తూన్నామని ఇప్పుడు మరో వ్యక్తి ఈ భూమి నాది అంటున్నారని ఈవిషయమై విచారణ జరిపి మాకు న్యాయం చేయా లని అర్జీ సమర్పించాడు. బెజ్జూరు మండలం మర్తిడికి చెందిన గంగారాం తన భూమిని ఆక్రమించుకు న్నారని అర్జీలు సమర్పించారు.

Updated Date - 2022-11-28T22:21:44+05:30 IST