పేదోళ్ల రాజ్యం కోసమే ప్రజాసంగ్రామ యాత్ర

ABN , First Publish Date - 2022-12-02T00:45:20+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో దొరలపాలనను అంతమొందించి పేదోడి పాలన తేవడానికే ప్రజాసంగ్రామయాత్ర చేపట్టినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

పేదోళ్ల రాజ్యం కోసమే ప్రజాసంగ్రామ యాత్ర
లింబా(బి) మీదుగా పాదయాత్రలో బండి సంజయ్‌, బీజేపీ నాయకులు

డబుల్‌ బెడ్రూంల జాడేది!?

ఎన్నికలొస్తేనే కేసీఆర్‌ వస్తడు

కుటుంబ పాలనను అంతమొందిద్దాం

ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన

కుంటాల, డిసెంబరు 1 : తెలంగాణ రాష్ట్రంలో దొరలపాలనను అంతమొందించి పేదోడి పాలన తేవడానికే ప్రజాసంగ్రామయాత్ర చేపట్టినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసా నుంచి ప్రారంభమైన యాత్ర 3వరోజు కుంటాల మండలంలో కొనసాగింది. గురువారం లింబా(బి) నైట్‌ క్యాంపు నుంచి ప్రారంభం అయినయాత్ర లింబా(బి), ఓలా, గ్రామాల మీదుగా అంబకంటి వరకు కొన సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బండిసంజయ్‌ పాదయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యువకులు ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొని నృత్యాలు చేశారు. లింబా(బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దొరల పాలన పోయి పేదోడిపాలన రావాలంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదవాడని, ఛాయ్‌ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారని అందుకే ఆయన ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం చంద్రశేఖర్‌రావుకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకువస్తారని, మిగతా సమ యంలో ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతారన్నారు. గ్రామంలో ఎందరు పేద ప్రజ లకు ఉండటానికి ఇళ్లు, తిండి లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, తెలం గాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు మాత్రమే ధనికులుగా మారుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పేదవారు అవతున్నారన్నారు. రైతులకు గిట్టుబాట ధర కల్పించడంతో పాటు, ఎరువులపై సబ్సిడీ అందించడం, ఉపాధిహామి ద్వారా ప్రజలకు పనులు కల్పించడం, గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించడం, ప్రజలకు ఉచిత బియ్యం, ఉచిత సిలిండర్‌లు, మహిళలకు పావలావడ్డీ రుణాలను కేంద్రప్రభుత్వం అందిస్తుంటే వాటన్నింటినీ దుర్వినియోగం చేసి సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అవినీతి పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్రం పథకాలను దారి మళ్లించి రాష్ట్ర పథకాలుగా మార్చుతున్నారన్నారు. ఓలా గ్రామంలో ప్రజలతో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు అందించలేని దుస్థితలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, 24గంటల కరెంటు అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. దళిబంధు, మిషన్‌భగీరథ, రుణమాణి, గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించడంలో కూడా విఫ లం అయిందన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరాలంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రజాకార్ల పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ అంటే కాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని అయన అన్నారు. కొన్ని చోట్ల డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని, అయితే పలువురు లబ్ధి దారులు వాటిల్లో ఉండే కంటే చెట్ల కింద ఉండడం మేలని పేర్కొంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్రకు మండలంలోని నలు మూలల నుండి కాకుండా పక్క మండలాల నుంచి సైతం యువకులు, బీజేపీ నాయకులు తరలివచ్చి ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:45:22+05:30 IST