రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే

ABN , First Publish Date - 2022-08-21T06:30:34+05:30 IST

దేశ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీతోనే సమ న్యాయం జరుగుతుందని, తెలంగాణలో ఏడాది తరువాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మ న్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు.

రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే
మీడియాతో మాట్లాడుతున్న ఏలేటి

మీడియాతో మహేశ్వర్‌ రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 20 : దేశ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీతోనే సమ న్యాయం జరుగుతుందని, తెలంగాణలో ఏడాది తరువాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మ న్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. శనివారం ఆయన నిర్మల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజలకు ఉచిత ఇళ్ల నిర్మాణం, కిలోరూపాయికే బియ్యం అందిం చడంతో పాటు రైతులకు రుణమాఫీ కల్పించింది కాంగ్రెస్‌ అని అన్నారు. సాగు, తాగునీరు అందించడం, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసింది కూడా తామేనని తెలిపారు. ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూర్తి వాగ్దానాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు తూట్లు పొడు స్తూ నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రం లో గొప్ప కార్యక్రమాలు చెప్పుకోదగ్గవి ఏవీ లేవన్నారు. కాంగ్రెస్‌ హయాం లో రాజ్యాంగాన్ని విజయవంతంగా అమలు చేశామని, రిజర్వేషన్లు అన్ని వర్గాల వారికి అమలు చేసినట్లు చెప్పారు. కష్టాలు తొలగాలంటే ప్రజలు కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీలను గద్దెదించాలని పిలుపునిచ్చారు. పార్టీ మారుతున్నట్లు వచ్చే వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను కోరారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడే ప్రసక్తి లేదని, కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు. 

ఘనంగా రాజీవ్‌కు నివాళి

జిల్లా కేంద్రం మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసంలో స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వ హించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌ సహానాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

Read more