ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల వనభోజనాలు

ABN , First Publish Date - 2022-10-04T05:08:26+05:30 IST

నిర్వరామంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా ప్రత్యేక సాయుధ బలగా లకు శారీరకంగా, మానసికంగా ఉల్లాసం ఉత్సాహాన్ని కలిగించేందుకు సోమవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ వారితో కలిసి వనభోజనాల్లో గడిపారు.

ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల వనభోజనాలు
సిబ్బందికి భోజనం వడ్డిస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 3: నిర్వరామంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా ప్రత్యేక సాయుధ బలగా లకు శారీరకంగా, మానసికంగా ఉల్లాసం ఉత్సాహాన్ని కలిగించేందుకు సోమవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ వారితో కలిసి వనభోజనాల్లో గడిపారు. రాత్రనక, పగలనక, విధి నిర్వహణలో ఉండేది పోలీసులేనని అన్నారు. కనుక అందరం కలిసి ఒకచోట మమేకం కావడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ వనభోజనాల్లో జిల్లా ఉన్నతాధికారు లతోపాటు కిందిస్థాయి సిబ్బంది ఆటల పాటలతో ఆనందంగా డిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీని వాస్‌, కరుణాకర్‌, నాగేందర్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Read more